తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళవుతున్నా డిమాండ్ మాత్రం అలాగే మెయింటైన్ చేస్తూ కొత్త హీరోయిన్లకు సవాల్ విసురుతున్నారు. సాధారణంగా పెళ్ళయాక అవకాశాలు తగ్గిపోవడం ఎవరికైనా సహజమే. కొందరు మాత్రమే దీనికి మినహాయింపుగా నిలుస్తారు. మన దగ్గర సమంతను ఉదాహరణగా తీసుకోవచ్చు. కానీ తను ఎలాంటి పాత్రయినా చేసే రేంజని పూర్తిగా చెప్పలేం. కానీ నయన్ విషయంలో మాత్రం దర్శకులు అలాంటి అనుమానాలు పెట్టుకోవడం లేదు. గ్లామరైనా యాక్షనైనా ఈజీ మోసేస్తుందని నమ్మకం చూపిస్తున్నారు.
తాజాగా తన రెమ్యునరేషన్ పది కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు చెన్నై టాక్. జిఎస్టిలు గట్రా కలుపుకుంటే ఇంకో కోటి అదనంగా ఉండొచ్చట. ఇంత మొత్తం అడుగుతున్నా ఎస్ అనే ప్రొడ్యూసర్లే ఎక్కువగా ఉన్నారని సమాచారం. మాములుగా ఇంత పారితోషికం ఒక మీడియం రేంజ్ స్టార్ హీరోకి ఇవ్వడమే కష్టం. అలాంటిది హీరోయిన్ కు ఆఫర్ చేయడం చిన్న విషయం కాదు. పైగా ఇటీవలే జవాన్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ కావడంతో హిందీ నుంచి కూడా దర్శకులు వచ్చి కథలు వినిపిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు పిల్లల తల్లనే సంగతే ఎవరికీ గుర్తు రానంత మేజిక్ నయనతార చేస్తోందన్న మాట.
జవాన్ కైతే అంత ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రతి సినిమాకు ఇలా వర్కౌట్ కాదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం జయం రవితో నటించిన ఇరైవర్ ఈ నెల 28 విడుదల కానుంది. మరో రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. స్టార్ హీరోల సరసన ఇంకా ఏ ప్రాజెక్టు ఓకే చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి 157కి అడుగుతున్నారు కానీ ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదట. ఏది ఏమైనా సుదీర్ఘ కాలం మార్కెట్ ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళలో నయన్ దే అగ్ర స్థానం. ఆ తర్వాత త్రిష, తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్ళు ఫుల్ బిజీగా కాలక్షేపం చేసేసుకుంటున్నారు.
This post was last modified on September 12, 2023 11:18 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…