తెలుగు సినీ చరిత్రలో తొలి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించి పెట్టిన పుష్ప 1 ది రైజ్ తర్వాత సీక్వెల్ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు నార్త్ నుంచి కేరళ దాకా జనాలు మాములుగా ఎదురు చూడటం లేదు. ఊహించని స్థాయిలో కేవలం డబ్బింగ్ రైట్స్ కే కోట్లు కుమ్మరించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ హాట్ కేక్స్ లా మారాయి. బాహుబలి, కెజిఎఫ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో లేదా అంతకు మించి బాక్సాఫీస్ సత్తా చాటగల ప్యాన్ ఇండియా మూవీగా పుష్ప 2 ది రూల్ మీద భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మైత్రి మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.
వరల్డ్ వైడ్ థియేటర్లలో పుష్ప 2 ది రూల్ 2024 ఆగస్ట్ 15 రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ చేసేశారు. ఐకాన్ స్టార్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు దీంతో తెరపడినట్టు అయ్యింది. ఒకరకంగా ఇది చాలా మంచి ఎత్తుగడ. అయితే ఈ డేట్ కి కట్టుబడి ఉండటం చాలా అవసరం. సలార్ లాగా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తేదీని ప్రకటించి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టి మిలియన్ మార్కు వైపు పరుగులు పెడుతున్న టైంలో హఠాత్తుగా పోస్ట్ పోన్ చేశారు. దీని వల్ల చాలా రాద్ధాంతం జరిగి ఇతర నిర్మాతలు ఇబ్బంది పడ్డారు. పుష్ప 2కు అలా జరగకుండా ఎక్కువ టైం సెట్ చేసుకున్నారు.
ఇండిపెండెన్స్ డేని టార్గెట్ చేసుకోవడం ద్వారా పుష్ప 2 పర్ఫెక్ట్ స్కెచ్ వేసుకుంది. అదే తేదీకి ఇండియన్ 2 వస్తుందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్-రవి వేసిన ఈ ఎత్తుగడ వల్ల చాలా లాభాలున్నాయి. ముందస్తుగా డిస్ట్రిబ్యూటర్లతో డీల్స్ సెట్ చేసుకోవడం వల్ల థియేటర్లను బ్లాక్ చేసుకోవచ్చు. తమిళనాడులో కొంత సమస్య వచ్చినా పుష్ప ఇమేజ్ వల్ల ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా ఆగస్ట్ నెల ఎంత అనుకూలంగా ఉంటుందో గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్లు నిరూపిస్తునే ఉన్నాయి. సో ఇంకో ఏడాది ఆగాల్సి వచ్చినా పర్వాలేదు కానీ పుష్ప ఫైర్ మాత్రం మాములుగా ఉండదు.
This post was last modified on September 11, 2023 7:12 pm
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…