Movie News

శ్రీలీలను తట్టుకోవడం కష్టం

శ్రీలీల.. శ్రీలీల.. శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి ఆమె చూస్తుండగానే నంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది. డెబ్యూ మూవీ ‘పెళ్ళి సందడి’తో సక్సెస్ అందుకుని.. రెండో చిత్రం ‘ధమాకా’తో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న శ్రీలీలకు టాలీవుడ్లో ప్రస్తుతం మామూలు డిమాండ్ లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల సినిమాల్లో ఆమె లీడ్ హీరోయిన్ అయిపోయిందంటే చిన్న విషయం కాదు. రాబోయే నాలుగైదు నెలల్లో ఆమె ఐదు సినిమాలతో సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుండటం విశేషం. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి ఏవైనా పాటల ప్రోమోలు రిలీజైతే చాలు.. ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతోంది. పాటల్లో ఆమె ఆకర్షణ మామూలుగా ఉండట్లేదు.

శ్రీలీల బేసిగ్గా సూపర్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చిందే డ్యాన్స్ వల్ల. ‘పెళ్ళి సందడి’ లాంటి పేలవమైన సినిమా కూడా బాగా ఆడిందంటే అందులోని పాటలు.. హీరో హీరోయిన్ల అందం, ఆకర్షణ.. వాళ్ల డ్యాన్సుల వల్లే. ముఖ్యంగా ‘యమునా నగరి’లో పాటలో శ్రీలీల డ్యాన్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. ‘ధమాకా’లో అయితే మాస్ డ్యాన్స్‌తో మంటలు పుట్టించింది శ్రీలీల. తర్వాతి రిలీజ్ ‘స్కంద’లోనూ శ్రీలీల డ్యాన్సులు ఒక రేంజిలో ఉంటాయని ప్రోమోలు చూస్తే అర్థమైంది.

మామూలుగా రామ్ మంచి డ్యాన్సర్. అలాంటి డ్యాన్సర్‌ను కూడా శ్రీలీల డామినేట్ చేసింది. ప్రోమోల్లో ఆమె అంతగా హైలైట్ అయింది. లేటెస్ట్‌గా ‘ఆదికేశవ’ నుంచి ఒక పాట రిలీజ్ చేశారు. అందులో శ్రీలీలను చూస్తూ చూపు తిప్పుకోవడం కష్టం. తన క్యూట్‌నెస్, హావభావాలు, అన్నింటికీ మించి మంచి ఈజ్‌తో ఆమె వేసిన స్టెప్స్ వారెవా అనిపించాయి. డ్యాన్స్‌కు స్కోప్ ఉన్న పాటలంటే చాలు.. పక్కన హీరో ఎవరున్నారో పట్టించుకోకుండా శ్రీలీలకు కనెక్ట్ అయిపోతున్నారు జనాలు. ఈ డామినేషన్ చూసి.. ఈ అమ్మాయితో కష్టం అని హీరోలు అసూయ పడితే ఆశ్చర్యం లేదు.

This post was last modified on September 10, 2023 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago