భోళా శంకర్ తర్వాత సుస్మిత కొణిదెల నిర్మాతగా చేయాల్సిన సినిమా కన్నా ముందు చిరంజీవి మెగా 157 మొదలుపెట్టే సూచనలు పెరుగుతున్నాయి. కూతురు ప్రాజెక్టు విషయంలో స్క్రిప్ట్, దర్శకుడు రెండు అంశాల మీద ఇంకా ఏకాభిప్రాయం రాలేదట. దాంతో దర్శకుడు వశిష్ట ఫాంటసీ మూవీనే స్టార్ట్ చేసే దిశగా పనులు జరుగుతున్నట్టు మెగా కాంపౌండ్ న్యూస్. నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఒకవేళ సుస్మిత చిత్రం కొంత ఆలస్యంగా షురూ చేసినా అది వేగంగా పూర్తి చేసే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.
ప్రస్తుతానికి హీరోయిన్ల వేట జరుగుతోందట. ప్రాథమికంగా మూడు ఆప్షన్లు పెట్టుకున్నట్టు తెలిసింది. నయనతార ఇప్పటికే సైరా నరసింహారెడ్డిలో చేసింది కాబట్టి జోడిగా తనైతే బాగుంటుందనే అభిప్రాయం టీమ్ లో ఉన్నట్టు తెలిసింది. గాడ్ ఫాదర్ లో చెల్లిగా నటించినా దాని ప్రభావం అంతగా పడలేదు. ఇక అనుష్క శెట్టిని కూడా అడుగుతున్నారట. ఇటీవలే రీ ఎంట్రీలో టాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న స్వీటీ గతంలో స్టాలిన్ లో స్పెషల్ సాంగ్, సైరాలో క్యామియో తప్ప చిరు సరసన ఫుల్ లెన్త్ రోల్ లో నటించలేదు. ఇప్పుడు ఓకే చెబితే జోడి పరంగా స్క్రీన్ మీద బాగుంటుంది.
సీతారామం మృణాల్ ఠాకూర్ ని కూడా అడుగుతున్నట్టు వినికిడి. అయితే ఇంత సీనియర్ హీరో పక్కన జోడిగా కడితే తర్వాత ఇబ్బందులు ఏమైనా వస్తాయనే ఆలోచన ఉండకపోదు. ప్రస్తుతం నాని హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఓకే చెప్పడం అంత సులభం కాకపోవచ్చు. పైగా హిందీలోనూ ఈ భామ బిజీగానే ఉంది. ఒకవేళ ఇవేవి వర్కౌట్ కానీ పక్షంలో వశిష్టకు కొత్త ఛాలెంజ్ మొదలవుతుంది. అసలే విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్న ఫాంటసీ మూవీ కాబట్టి మీడియం రేంజ్ వాళ్ళను తీసుకుని సర్దుకోవడానికి లేదు. ప్రతిదీ గ్రాండ్ గా ఉండాల్సిందే.
This post was last modified on September 9, 2023 11:50 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…