ఒక్క సలార్ సినిమా వాయిదా పడేసరికి వివిధ భాషల్లో ఎన్ని సినిమాలు రీ షెడ్యూల్ అయ్యాయో తెలిసిందే. సలార్ వాయిదా వార్త బ్రేక్ అయ్యాక ఇండియాలో అన్ని మేజర్ ఫిలిం ఇండస్ట్రీలు చిన్నపాటి కుదుపుకి లోనయ్యాయి. సలార్ వాయిదా అయితే పక్కా అని తేలిపోయింది కానీ.. కొత్త డేట్ ఏదనే విషయంలోనే క్లారిటీ లేదు. సలార్ బాంబు ఎక్కడ తమ మీద పడుతుందో అని తర్వాత రెండు మూడు నెలల్లో రిలీజ్ ఖరారు చేసుకున్న సినిమాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.
సంక్రాంతి అని.. క్రిస్మస్ అని.. దీపావళి అని.. ఇలా రకరకాల సీజన్లను పరిశీలిస్తున్నారు. మధ్యలో పండుగ సీజన్‌ను పక్కన పెట్టి నవంబరు 24కి ఫిక్సయినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఐతే క్రిస్మస్, సంక్రాంతి అంటే మరీ ఆలస్యం అయిపోతుంది.. పైగా ఆయా సీజన్ల మీద చాలా సినిమాలు ఆశలు పెట్టుకున్నాయి. కాబట్టి ఆ రెండు ఆప్షన్లను పక్కన పెట్టేశారు.
నవంబరు 24న రిలీజ్ చేస్తే పండుగ అడ్వాంటేజ్ ఉండదు, పైగా ఇంకో వారానికే యానిమల్ లాంటి క్రేజీ మూవీ వస్తుంది. అందుకే పలు విధాల ఆలోచించి దీపావళి వీకెండ్లో సలార్‌ను రిలీజ్ చేద్దామని కొంచెం గట్టిగానే ఆలోచిస్తోందట చిత్ర బృందం. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ వీకెండే కోరుకుంటున్నారట. దీపావళి టాలీవుడ్‌కు అంత అచ్చొచ్చిన సీజన్ కాకపోయినా.. నార్త్ ఇండియాతో పాటు తమిళనాట క్రేజీ సీజనే. లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది కూడా.
అందుకే ఆ టైంలో సల్మాన్ ఖాన్ సినిమా టైగర్3 షెడ్యూల్ అయి ఉన్నప్పటికీ.. సలార్‌ను అప్పుడే దించుదామని చూస్తున్నారట. టైగర్ 3 వాయిదా పడుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు అయితే రాలేదు. మరి సల్మాన్ సినిమా పోటీలో ఉన్నా సై అంటున్నారంటే సలార్ టీం కాన్ఫిడెన్సే వేరని చెప్పాలి. అదే ఫిక్స్ అయితే మాత్రం సల్మాన్‌కు చాలా కష్టమవుతుంది. అసలే సల్మాన్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో సల్మాన్ అండ్ టీం గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం.
This post was last modified on September 9, 2023 12:37 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…