సెప్టెంబర్ బాక్సాఫీస్ చిత్ర విచిత్ర పరిణామాలకు వేదికగా నిలుస్తోంది. సలార్ వాయిదా ప్రభావం ఎంత తీవ్రంగా ఇతర సినిమాల మీద పడిందో చూశాం. తాజాగా వచ్చే 15 విడుదల కావాల్సిన చంద్రముఖి 2 హఠాత్తుగా పోస్ట్ పోన్ చేశారు. సాంకేతిక కారణాలని చెబుతున్నారు కానీ చెన్నై టాక్ మాత్రం ఇంకోలా ఉంది. జవాన్ ప్రభంజనం ఇంకో వారం పది రోజులు సులభంగా ఉంటుందని గుర్తించి, ఆ సునామిలో దెబ్బ తినడం కంటే చక్కగా సైడ్ అయిపోయి ఇంకో డేట్ చూసుకుందామని అనుకున్నారట. అయితే టీమ్ నుంచి కొత్త తేదీకి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు.
అటుఇటు తిప్పి ఇది కూడా సెప్టెంబర్ 28 వచ్చిందంటే మాత్రం అంతే సంగతులు. ఎందుకంటే ఆల్రెడీ స్కంద భారీ స్కెచ్చు వేసుకుని రెడీగా ఉంది. నిజానికీ క్లాష్ వినాయక చవితికే ఫిక్స్ అయినా సలార్ వల్ల మారింది. తీరా చూస్తే మళ్ళీ కొట్టుకోవడం ఖాయమే అనిపిస్తోంది. స్కంద మీద లారెన్స్ ప్రభావం మరీ తీవ్రంగా ఉంటుందని చెప్పలేం కానీ మాస్ మార్కెట్స్ లో చంద్రముఖి బ్రాండ్ కున్న ఫాలోయింగ్ ని తక్కువంచనా వేయకూడదు. అయితే లైకా సంస్థ మాత్రం తీవ్ర చర్చల్లో ఉంది. చెన్నైలో అంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక ఇలాంటి నిర్ణయం వెలువడటం ఆశ్చర్యం.
ఇదంతా విశాల్ కు అదృష్టంగా మారుతోంది. మార్క్ ఆంటోనీకి సోలో రిలీజ్ దక్కించుకోబోతున్నారు. ముందు అనుకున్న ప్రకారమైతే పోటీలో నలిగిపోతుందేమో అనుకుంటే ఇప్పుడు ఏకంగా సింగల్ గా రాబోతోంది. ఎలాగూ తెలుగులోనూ చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి యావరేజ్ టాక్ వచ్చినా చాలు నిలబడిపోతుంది. వినాయకుడి పండక్కు శుభ్రంగా పిండి వంటలు తినేసి రెండు మూడు కొత్త సినిమాలు చూద్దామంటే మార్క్ ఆంటోనీ ఒకటే ఆప్షన్ గా నిలబడేలా ఉంది. చంద్రముఖి క్లైమాక్స్ లాగే రిలీజ్ కూడా సస్పెన్స్ తో అంతు చిక్కని కథలా మారుతోంది. చూద్దాం ఇంకేం చెబుతారో.
This post was last modified on September 8, 2023 2:15 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…