మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి పరిచయం లేని వారికి.. ఆయన్ని చూపించి వయసు ఎంత ఉండొచ్చు అంటే అటు ఇటుగా 50 ఏళ్లు అంటారేమో. కానీ ఆయన గురువారం నాడు 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారని తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటులు, టాప్ స్టార్లలో ఒకడైన మమ్ముట్టి మలయాళంలోనే కాక.. పలు భాషల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.
తెలుగులో ఆయన నటించిన స్వాతికిరణం తరతరాలకు నిలిచిపోయే ఒక కళాఖండం. ఆ చిత్రంలో మమ్ముట్టి నటన వర్ధమాన నటులకు ఒక పాఠ్యపుస్తకం లాంటిది అంటే అతిశయోక్తి కాదు. ఇక తన మాతృభాషలో మమ్ముట్టి చేసిన పాత్రలు.. చేసిన ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు మీద పడ్డాక కూడా ఆయన జోరేమీ తగ్గలేదు. ఇమేజ్ ఛట్రం నుంచి పూర్తిగా బయటికి ఇంకా ఇంకా ప్రయోగాలు చేస్తూ.. విభిన్నమైన పాత్రలు చేస్తూ సాగిపోతున్నారాయన. ఈ పుట్టిన రోజు నాడు మమ్ముట్టి నటిస్తున్న ఒక పాన్ ఇండియా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అయింది.
అది చూసి మలయాళీలే కాదు.. అన్ని భాషల వాళ్లూ షాకవుతున్నారు. ఆ సినిమా పేరు ‘భ్రమయుగం’. ఇదొక నెవర్ బిఫోర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన బ్లాక్ వైట్ థీమ్ ఫస్ట్ లుక్‌లో మమ్ముట్టి సరికొత్త అవతారంలో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ వయసులోనూ ఇలాంటి ప్రయోగాలతో ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ కాగలగడం మమ్ముట్టికే చెల్లింది. ఈ ఏడాది చివర్లో భ్రమయుగం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on September 8, 2023 9:46 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…