మామూలుగా పెద్ద హీరోల అభిమానులు.. తమ హీరోలు నటించే సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోరుకుంటారు. సినిమా ఖరారైతే అప్‌డేట్ కావాలి. ఆ తర్వాత అది సెట్స్ మీదికి వెళ్లినా.. షూటింగ్ జోరుగా సాగుతున్నా.. లేదా బ్రేక్ పడినా.. ఇలా ప్రతి దశలోనూ వాళ్లకు అప్‌డేట్స్ కావాలి. ఈ విషయంలో నిర్మాతల మీద విపరీతమైన ప్రెజర్ కూడా పెడుతుంటారు. ఐతే మిగతా హీరోలతో పోలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భిన్నం. ఆయన చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తన ప్రథమ ప్రాధాన్యం ఆ రంగానికే అంటున్నారు. సినిమాల మీద ఆయనకు బేసిగ్గా పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
కానీ ఎవరి మీదో ఆధారపడకుండా సొంతంగా పార్టీని నడపాలంటే నిధులు అవసరం కాబట్టి సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో అభిమానుల ఆకాంక్షలను కూడా నెరవేరుస్తున్నారు. ఐతే ఓవైపు రాజకీయాల్లో ఉంటూ.. సినిమాలు ఏంటంటూ ప్రత్యర్థులు ఆయన మీద విమర్శలు గుప్పిస్తుంటారు. ఆయన్ని పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ విమర్శిస్తుంటారు. ఈ విషయంలో పవన్‌ను డిఫెండ్ చేయలేక జనసేన నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటారు. వారాహి యాత్ర మొదలయ్యాక పవన్ మెజారిటీ సమయం రాజకీయాలకే కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండేట్లయితే ఇక సినిమాలన్నీ పక్కన పెట్టేయాలని కూడా పవన్ అనుకున్నాడు. కానీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగేట్లు ఉండటంతో ఓవైపు వారాహి యాత్ర చేస్తూనే మధ్య మధ్యలో కొంచెం ఖాళీ చేసుకుని షూటింగ్‌లో పాల్గొని మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఐతే సినిమాలనేవి పవన్‌కు సెకండరీ అనే విషయం చాలామంది అర్థం చేసుకున్నా సరే.. పవన్‌ను విమర్శించడానికి దీన్నే ఆయుధంగా వాడుకోవాలని వైసీపీ చూస్తోంది. వారాహి యాత్ర మధ్యలో ‘బ్రో’ కోసం డబ్బింగ్ చెబితే దాన్ని భూతద్దంలో చూపించి రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ఆ విషయాన్ని తిప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పవన్ వీలు చేసుకుని డేట్లు ఇస్తున్నందుకు నిర్మాతలకు చాలా సంతోషంగా ఉండొచ్చు కానీ.. రాజకీయంగా ఆయనకు ఇబ్బంది రాకూడదంటే వాళ్లు పవన్ షూటింగ్ చేస్తున్న విషయం గురించి.. కొత్త షెడ్యూళ్ల గురించి ఘనంగా ప్రకటనలు చేయకపోతేనే బెటర్. పవన్ మంచి కోరుకుంటే వాళ్లు చేయాల్సింది అదే. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసినట్లు ఘనంగా అనౌన్స్‌మెంట్లు ఇచ్చి.. దాని వల్ల రాజకీయ విమర్శలు వచ్చి.. ఇప్పుడు ఎందుకొచ్చిన తలనొప్పి అని పవన్ షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తే అప్పుడు ఇబ్బంది పడేది నిర్మాతలే అని గుర్తుంచుకోవాలి.
This post was last modified on September 8, 2023 9:41 am
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…