రీ రిలీజులు కూడా పక్కాగా ప్లాన్ చేసుకుని విడుదల చేయాల్సిన ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. సరైన ప్రణాళిక ఉంటే కాసుల వర్షం ఖాయమే. సెప్టెంబర్ 22 రాబోతున్న 7జి బృందావన్ కాలనీ మీద డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ప్లానింగ్ చూస్తుంటే స్టార్ హీరోలు లేకుండా కేవలం కొత్త మొహాలతో రికార్డులు నమోదు చేసిన పాత సినిమాగా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉంది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, యూరప్ లాంటి దేశాల్లోనూ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లు కూడా సరిపడా దొరకనుండటంతో ఏడు రోజుల పాటు వసూళ్ల మోత ఖాయమే.
ఈ మూవీకి కలిసొస్తున్న అతి పెద్ద సానుకూలాంశం ఆ రోజు కొత్త రిలీజులు ఒక్కటంటే ఒక్కటి లేకపోవడం. సలార్ వస్తుందని భయపడి సెప్టెంబర్ మూడో వారాన్ని అనాథలా వదిలేశారు. తీరా చూస్తే ప్రభాస్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇది ఊహించని పరిణామం కావడంతో అప్పటికప్పుడు 22కి సిద్ధమయ్యేలా ఏ నిర్మాతా లేకపోవడంలో 7జి బృందావన్ కాలనీకి భలే కలిసొస్తుంది. ఆరంజ్, మన్మథుడుకి థియేటర్లలో ఊగిపోయిన ప్రేక్షకులు ఇక యువన్ శంకర్ రాజా చేసిన మేజిక్ కి, రవి-సోనియా అగర్వాల్ మధ్య లవ్ ట్రాక్ కి ఏ రేంజ్ లో పరవశించిపోతారో చెప్పడం కష్టమే.
ఎంతలేదన్నా నాలుగైదు రోజుల పాటు స్ట్రాంగ్ రన్ ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే జవాన్ అప్పటికంతా చల్లారిపోయి ఉంటుంది. వినాయచవితికి వచ్చే చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ ఏదో అద్భుతంగా ఉన్నాయని టాక్ వస్తే తప్ప మార్కెట్ లో వారం మించి నిలబడవు. సో ఆడియన్స్ కి బృందావన్ కాలనీనే బెస్ట్ ఛాయస్ అవుతుంది. అయినా ఎంత విచిత్రమైన పరిస్థితి కాకపోతే టివిలో యూట్యూబ్ లో అరిగిపోయిన బ్లాక్ బస్టర్ల కోసం ఇంతగా హైప్ ఏర్పడుతోందంటే కొత్త సినిమాల నిర్మాతలు దర్శకులు తప్పెక్కడ జరుగుతోందో అర్జెంటుగా గుర్తించాలి.
This post was last modified on September 7, 2023 12:32 pm
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…