Movie News

ఆ ట్వీట్‌తో ఏం సాధించారు?

టాలీవుడ్లో రెండు దశాబ్దాలుగా నైజాం డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజుదే ఆధిపత్యం. ఆయన్ని కొట్టాలని కొందరు డిస్ట్రిబ్యూటర్లు చాలా దూకుడుగా డిస్ట్రిబ్యూషన్లో అడుగులు వేశారు. కానీ తర్వాత దెబ్బ తిని వెనుకంజ వేశారు. అందులో అభిషేక్ నామా కూడా ఒకరు. అభిషేక్ పిక్చర్స్ పేరు మీద ఒక టైంలో చాలా దూకుడుగా సినిమాలు కొని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాడు అభిషేక్. తర్వాత అతను నిర్మాణంలోకి కూడా వచ్చాడు.

గూఢచారి, సాక్ష్యం, రావణాసుర సహా పలు చిత్రాలు నిర్మించాడు. కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ, నిర్మాణంలో కానీ అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయాడు. దిల్ రాజులా అందరికీ జడ్జిమెంట్ ఉండదని.. డిస్ట్రిబ్యూషన్ అంత తేలికైన విషయం కాదని చెప్పడానికి అభిషేక్ కూడా ఒక ఉదాహరణ.విజయ్ దేవరకొండ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న అభిషేక్.. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఏకంగా 8 కోట్లు నష్టపోయాడట.

ఐతే దీనికి నష్టపరిహారం పొందాలని అభిషేక్ ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత ప్రొడక్షనే ఆపేసిన కేఎస్ రామారావు.. చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో భాగస్వామిగా మారడంతో ఆ సినిమా రిలీజ్ టైంలో తాడో పేడో తేల్చుకోవాలని అనుకున్నాడు. కానీ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా.. పోస్టర్ల మీది నుంచి రామారావు పేరు ఎగిరిపోయింది. నిజంగానే ఆయన ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా.. రిలీజ్ సమస్యలు తప్పవని తప్పించారా అన్నది తెలియదు కానీ.. అభిషేక్‌‌కు మాత్రం సెటిల్మెంట్ జరగలేదు.

ఐతే డిస్ట్రిబ్యూషన్లో లాభాలు వస్తే నిర్మాతకో, హీరోకు అందులో వాటాలు ఇవ్వడం జరగనపుడు.. నష్టం వస్తే వాళ్లు సెటిల్మెంట్ చేయాలన్న రూల్ ఏమీ లేదు. కాకపోతే మ్యూచువల్ ట్రస్ట్ మీద, మానవతా దృక్పథంతో నిర్మాతలు కొన్నిసార్లు పరిహారం చెల్లిస్తుంటారు. ఈ రకంగా ఏదో సెటిల్ చేసుకోవాలి కానీ.. హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’కి తాను అందుకున్న రెమ్యూనరేషణ్ నుంచి ఆర్థిక సమస్యల్లో ఉన్న అభిమానులకు ఏదో కొంత సాయం చేస్తుంటే ఆ విషయం ప్రస్తావిస్తూ.. తమకు సెటిల్మెంట్ గురించి అతణ్ని ట్విట్టర్ వేదికగా నిలదీశారు అభిషేక్ పిక్చర్స్ అధినేతలు.

ఈ ట్వీట్ తీవ్ర దుమారమే రేపింది. నెటిజన్ల నుంచి ఏమాత్రం సానుకూల స్పందన రాలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సంస్థకు న్యాయం చేయాలని మద్దతుగా నిలవకపోగా.. హీరోను, అది కూడా ట్విట్టర్లో నిలదీయడం ఏం పద్ధతి అంటూ అందరూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీస సానుభూతి రాలేదు. ఈ చర్య వల్ల ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వారికి మద్దతుగా సెటిల్మెంట్ కోసం ఎవరూ మందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తానికి ఈ ట్వీట్‌తో అభిషేక్ పిక్చర్స్ సాధించిందేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది.

This post was last modified on September 6, 2023 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

3 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

5 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

6 hours ago