Movie News

డిజాస్టర్ల చరిత్ర దశాబ్దాల నాటిది

ఒక సెల్ ఫోన్ కొన్నాక అందులో ఏదైనా నాణ్యత లోపం అనిపిస్తే సర్వీస్ సెంటర్ కు వెళ్లి రిపేర్ చేయించుకోవడం తప్ప వినియోగదారుడికి వేరే ఆప్షన్ ఉండదు. దానికోసం ఖర్చు పెట్టిన విలువైన సమయం, డబ్బు ఎవరూ భర్తీ చేయరు. ఇది ప్రతి వ్యాపారంలో ఉన్న సూత్రమే. అన్నీ అలోచించి కొనుగోలు చేయడమే కస్టమర్ బాధ్యత. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ వల్ల తాము ఎనిమిది కోట్లు నష్టపోయామని మమ్మల్ని ఆదుకోమంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి అభిషేక్ పిక్చర్స్ పెట్టిన ట్వీట్ చాలా తీవ్ర చర్చకు దారి తీసింది. నిర్మాతను వదిలేసి హీరోని అడగటం ఏంటని కౌంటర్లు పడుతున్నాయి.

ఇదేదో వరల్డ్ ఫేమస్ లవర్ కే మొదటిసారి జరిగినట్టు కలరిచ్చే ప్రయత్నం మాత్రం సమర్ధనీయం కాదు. ఎందుకంటే డిజాస్టర్లు దశాబ్దాల నుంచి వస్తూనే ఉన్నాయి. ఇవి లేని హీరో ఇండియాలో అదే భారత్ లోనే లేడంటే అతిశయోక్తి కాదు. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి మహేష్ బాబు దాకా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి. సామ్రాట్ అశోక, మృగరాజు, పరమవీరచక్ర, చిన్నబ్బాయి. భాయ్,నరసింహుడు, బాబీ, దొంగల ముఠా, శాకుంతలం, ఏజెంట్, ది వారియర్ ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్దీ లిస్టు రాసుకుంటూ పోవచ్చు. వీటిలో ఎనిమిది కాదు ఇరవై ముప్పై కోట్లు పోయినవి ఉన్నాయి.

కాబట్టి రేట్ పెట్టి కొనేముందే హీరో మార్కెట్ ని బట్టి, ప్రమోషన్ కంటెంట్ ని బట్టి అంత ధర పెట్టాలో వద్దో ముందే సిద్ధపడి రిస్క్ తీసుకోవాలి తప్పించి సినిమా పోయాక నా సొమ్ములు నాకు కావాలంటే ఎవరు కొనమన్నారనే ప్రశ్నే వస్తుంది. అప్పుడెప్పుడో అప్పుల బాధ తట్టుకోలేక ఓ నిర్మాత హుసేన్ సాగర్ లో దూకినందుకు మీడియాలో రావడం తప్ప ఆయన సాధించిందేమీ లేదు. ఇది నిరంతర ప్రవాహం. అన్నీ హిట్లే తీసే పనైతే ముఖేష్ అంబానీ రోజుకో సినిమా తీయిస్తాడు. క్రియేటివిటీ ఫీల్డ్ లో అలా ముందే ఊహించడం కష్టం. కొన్నిసార్లు లాటరీ తరహా అనిపించే బిజినెస్ ఇది.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే అసలు నిప్పుని ముందే గుర్తిస్తే నొప్పే ఉండదు. అలా కాకుండా కేవలం కాంబినేషన్లను నమ్ముకుని గుడ్డిగా కోట్లు కుమ్మరించినప్పుడు లాభాలకు ఎలాగైతే సిద్ధంగా ఉంటారో నష్టాలకు ప్రిపేర్ అవ్వాలి. లేదంట మనుగడ కష్టం. అందులోనూ స్టార్ హీరోలతో సత్సంబంధాలు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అనవసర ఆవేశానికి పోతే రావాల్సిన ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతాయి. స్థోమతకు మించిన బరువుని భుజాన వేసుకున్నప్పుడు దాని వల్ల కలిగే బాధకు సిద్ధపడే ఉండాలి. అంతే తప్ప ఇష్టంగా వేసుకుని తర్వాత ఇచ్చినవాడిని తిట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

This post was last modified on September 6, 2023 3:43 pm

Share

Recent Posts

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

20 minutes ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

3 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

5 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

5 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

6 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

6 hours ago