Movie News

‘సైజ్ జీరో’ ఎఫెక్ట్‌పై అనుష్క..

సౌత్ ఇండియాలో అనుష్క లాంటి ఇమేజ్ చాలా తక్కువమంది హీరోయిన్లకే వచ్చింది. గ్లామర్ రోల్స్ చేస్తున్న సమయంలోనే ‘అరుంధతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో తిరుగులేని స్టార్ డమ్‌ సంపాదించిన ఆమె.. ఆ తర్వాత రుద్రమదేవి, భాగమతి చిత్రాలతో ఇంకా పెద్ద రేంజికి వెళ్లింది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించిన అనుష్క.. దాని తర్వాత సినిమాల సంఖ్య బాగా తగ్గించేయడం అభిమానులకు నిరాశ కలిగించే విషయం.

ఆమె చివరి థియేట్రికల్ రిలీజ్ ‘భాగమతి’ రిలీజై ఐదేళ్లు అయిపోయింది. మధ్యలో ‘నిశ్శబ్దం’ మూవీతో నేరుగా ఓటీటీలో ప్రేక్షకులను పలకరించిన అనుష్క.. ఎట్టకేలకు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో థియేటర్లలోకి వస్తోంది. అనుష్క సినిమాలు మరీ తగ్గించేయడం.. అసలు ప్రమోషన్లకు రాకుండా, ప్రేక్షకులకు కనిపించకుండా ఉండటం మీద అనేక సందేహాలున్నాయి.

‘సైజ్ జీరో’ సినిమా కోసం బరువు పెరిగి తగ్గే క్రమంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయని.. ఆమె లుక్ తేడా కొట్టిందని.. అందుకే అనుష్క బయట కనిపించట్లేదనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సందేహాలకు ఆమె మీడియా ఇంటర్వ్యూల్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘‘సైజ్ జీరో సినిమా వచ్చింది 2015లో. ఆ తర్వాత నేను ‘ఓం నమో వేంకటేశాయ’, ‘బాహుబలి-2’; ‘భాగమతి’.. ఇలా వరుసగా సినిమాలు చేశా.

నేను తీసుకున్న విరామానికి సైజ్ జీరో ఎంతమాత్రం కారణం కాదు. నాకు నచ్చి చేసిన పాత్ర అది. ప్రతి దాంట్లోనూ ప్లస్సులు, మైనస్‌లు ఉంటాయి. దాని కంటే ముందు నేను చేసిన సినిమాల వల్ల చాలా గాయాలయ్యాయి. అందుకే ‘భాగమతి’ తర్వాత బ్రేక్ తీసుకోవాలనుకున్నా. అది నా వ్యక్తిగత నిర్ణయం. వరుసగా భారీ సినిమాలు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయా. అందుకే విశ్రాంతి అవసరం అనిపించింది. అంతే తప్ప నా విరామానికి పర్టికులర్‌గా ఏ ఒక్క సినిమానో కారణం కాదు’’ అని అనుష్క స్పష్టం చేసింది.

This post was last modified on September 6, 2023 1:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

2 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

4 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

5 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

5 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

6 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

6 hours ago