ఒక పెద్ద ప్యాన్ ఇండియా సినిమా వాయిదా పడితే దాన్ని ఆషామాషీగా పుకారు రూపంలో చెప్పకూడదు. అఫీషియల్ గా ప్రొడక్షన్ హౌస్ నుంచి కనీసం ఒక పోస్టర్ రూపంలో రావాలి. కానీ హోంబాలే ఫిలిమ్స్ కి అదేమీ పట్టలేదు. సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్ పోన్ అయిన సంగతి ప్రపంచమంతా కోడై కూస్తున్నా తాము మాత్రం సైలెంట్ గా ఉండటం ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించింది. అయితే కొత్త డేట్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నందు వల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారని బెంగళూరు టాక్. పలు దఫాలు డిస్ట్రిబ్యూటర్లతో ఫోన్లలో తీవ్ర చర్చలు జరిగాయని తెలిసింది.
సలార్ టీమ్ మూడు ఆప్షన్లు చూస్తోంది. ఒకటి నవంబర్. అయితే బయ్యర్లు దీని పట్ల అంత సానుకూలంగా లేరు. దసరా, దీపావళి పండగలయ్యాక చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని అభిప్రాయపడుతున్నారు. రెండు డిసెంబర్. ఆల్రెడీ ఇతర సినిమాలతో ప్యాక్ అయిపోయింది. కానీ ఇంత భారీ చిత్రాలకు అది సూటబుల్ కాదు. ఇక జనవరి చూస్తేనేమో గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, విజయ్ దేవరకొండ 13 కాచుకుని ఉన్నాయి. సలార్ వస్తుందంటే ఒకటో రెండో డ్రాప్ అవ్వాలి. అదేదో ఇప్పుడే చెప్పాలి. మరీ ఆలస్యం చేస్తే తోటి నిర్మాతల నుంచే నిరసన సెగలు చూడాల్సి వస్తుంది.
మొన్న జూన్ లో వంద రోజుల కౌంట్ డౌన్ అంటూ హంగామా మొదలుపెట్టిన హోంబాలే సంస్థ మాట మీద ఉండేలా ప్లాన్ చేసుకోకపోవడం ముమ్మాటికీ ప్లానింగ్ లోపమే. విఎఫెక్స్ పనులు సరిగా జరగలేదనే టాక్ వినిపిస్తోంది కానీ నిజానిజాలు టీమ్ కే ఎరుక. తన వంతు నటించడం పూర్తి చేశాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్ ని తప్పు బట్టేందుకు ఏమీ లేదు. కాకపోతే అభిమానులు బాధ పడటం గుర్తించి భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. చివరికి ఏ డెసిషన్ వస్తుందోననే సస్పెన్స్ మూవీ లవర్స్ నే కాదు ఇండస్ట్రీ వర్గాలను సైతం తీవ్రంగా వేధిస్తోంది.
This post was last modified on September 6, 2023 1:18 pm
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…