సలార్ తప్పుకోవడంతో ఒక్కసారిగా చిన్న సినిమాల నిర్మాతలు, హీరోలు అలెర్ట్ అయిపోయి ఆ డేట్ మీద కర్చీఫ్ వేసేందుకు పోటీ పడుతున్నారు. మొన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ తమ మ్యాడ్ ని మొదటి ప్రకటనగా ఇచ్చేయగా ఇవాళ రూల్స్ రంజన్ బృందం ప్రెస్ మీట్ పెట్టి మరీ సెప్టెంబర్ 28న వస్తున్నామని చెప్పేశారు. స్కంద, టైగర్ నాగేశ్వరరావులు సైతం అదే డేట్ చూస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ముందుగానే చెప్పేసుకోవడం ద్వారా ఒక అడ్వాంటేజ్ ఉంటుందని గుర్తించిన ప్రొడ్యూసర్లు ముందస్తు జాగ్రత్తగా తమ వైపు ఒక లాజిక్ ఉండేలా రిజర్వేషన్ చేసుకుంటున్నారు.
ఎంచుకుంటున్న కంటెంట్ వల్ల ట్రోలింగ్ కి గురవుతున్న కిరణ్ అబ్బవరం ముఖ్యంగా మీటర్ విషయంలో ఎదురుకున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. మరీ నేలవిడిచి సాము చేసే రీతిలో తనకే మాత్రం సెట్ కానీ పోలీస్ ఆఫీసర్ మాస్ తో చేసిన ఆ సినిమా దారుణంగా డిజాస్టరవ్వడమే కాదు సమర్పించిన మైత్రికి సైతం ఒక బ్లాక్ మార్క్ లా ఉండిపోయింది. కిరణ్ కు అంతకు ముందు దక్కిన వినరో భాగ్యము విష్ణు కథ డీసెంట్ సక్సెస్ దీని దెబ్బకే గుర్తు లేనంతగా ఎగిరిపోయింది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం రూల్స్ రంజన్ ని సమర్పిస్తుండగా ఆయన అబ్బాయి రత్నం కృష్ణ డైరెక్షన్ చేశారు.
ఈ సందర్భంగా చాలా ప్రశ్నలే ఎదురయ్యాయి కానీ యూనిట్ సభ్యులు అన్నింటికి ఓపిగ్గా సమాధానం చెప్పారు. రూల్స్ రంజన్ జనం దృష్టిలో పడేందుకు శ్రేయ ఘోషల్ పాడిన సమ్మోహనుడా పెదవిస్తానీకే పాట, అందులో హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్ ఆరబోత బాగా క్లిక్ అయ్యాయి. ఎంటర్ టైన్మెంట్ జానర్ లోనే రూపొందినప్పటికీ ఇందులో అన్ని అంశాలు ఉంటాయని అంటున్నారు. త్వరలో ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్టుకి రెడీ అవుతున్న కిరణ్ అబ్బవరంకి ఇది పెద్ద హిట్ అయితేనే దానికి సంబంధించిన అడుగులు వేగంగా పడతాయి. చూడాలి మరి ఈసారైనా టాలెంట్ కి పాజిటివ్ ఫలితం తోడవుతుందో లేదో.
This post was last modified on September 4, 2023 2:12 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…