Movie News

సలార్ ఫ్రస్టేషన్.. ఎవరి మీద చూపించాలి?

24 గంటల వ్యవధిలో మొత్తం కథ మారిపోయింది. నిన్న ఉదయం వరకు సలార్ హైప్‌తో ఊగిపోతూ వచ్చిన అభిమానులు.. ఒక్క రోజు వ్యవధిలో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ నెల 28న విడుదల కావాల్సిన ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ వాయిదా పడిపోయింది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్న మాటే కానీ.. అది లాంఛనమే అనడంలో సందేహం లేదు. యుఎస్‌లో ప్రిమియర్స్ షోలకు సంబంధించి టికెట్ల అమ్మకాలన్నీ ఆగిపోయి ఆల్రెడీ బుక్ అయిన టికెట్లక రీఫండ్స్ కూడా ఇచ్చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన ప్రభాస్ ఫ్యాన్స్.. ‘సలార్’ మీదే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాకు వచ్చిన హైప్ చూస్తే.. గత చేదు అనుభవాలన్నీ చెరిగిపోయే రేంజిలో ప్రభాస్‌కు భారీ బ్లాక్ బస్టర్ రావడం గ్యారెంటీ అనే అంచనాలు ఏర్పడ్డాయి. ‘సలార్’ సెప్టెంబరు 28న వస్తుందా లేదా అనే విషయంలో కొన్ని నెలల ముందే చర్చ జరిగింది. కానీ చిత్ర బృందమే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ఎప్పటికప్పుడు కౌంట్ డౌన్ నడుపుతూ వచ్చింది. 100 రోజుల్లో సలార్.. 50 రోజుల్లో సలార్ అంటూ ఊరించింది.

రిలీజ్ డేట్‌ను అందుకోవడంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. అది చూసే ఓవర్సీస్‌లో రిలీజ్‌కు నెల రోజుల ముందే టికెట్ల అమ్మకాలు కూడా మొదలయ్యాయి. కానీ రిలీజ్ నెలలోకి అడుగు పెట్టగానే కథ మారిపోయింది. వాయిదా న్యూస్ బయటికి వచ్చింది. దీంతో ఇటు అభిమానుల్లో, అటు డిస్ట్రిబ్యూటర్లలో మామూలు ఫ్రస్టేషన్ లేదు. ఇంత పెద్ద సినిమా తీసిన టీంకు ఆ మాత్రం ప్లానింగ్ ఉండదా.. ఈ ఒక్క సినిమా మీద ఆధారపడి పదుల సంఖ్యలో వేరే చిత్రాల రిలీజ్ ప్లానింగ్ ఆధారపడి ఉన్నపుడు బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం లేదా అని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అసహనం వ్యక్తమవుతోంది.

ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఇండస్ట్రీల సినిమాల ప్లానింగ్ దానికి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు ‘సలార్’ వాయిదాతో మొత్తం గందరగోళంగా తయారైంది పరిస్థితి. చాలా సినిమాల డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి. పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదన్న మాట వాస్తవమే కానీ.. ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ సమస్య అంటూ ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాలు ‘సలార్’ టీంను తిట్టిపోస్తున్నారు.

This post was last modified on September 3, 2023 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

20 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago