స్వతహాగా తెలుగువాడు అయినప్పటికీ.. తమిళంలో హీరోగా మంచి పేరు సంపాదించి స్టార్‌గా ఎదిగాడు విశాల్. యాక్షన్ సినిమాలతో అతడికి మాస్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘అభిమన్యుడు’ లాంటి సినిమాలు పెద్ద స్టార్ల చిత్రాలకు దీటుగా వసూళ్లు రాబట్టాయి తమిళనాడులో. ఐతే కొన్నేళ్లుగా విశాల్‌కు సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం అతను హీరోగా ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమా చేస్తున్నాడు.
చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ పీరియడ్ ఫిలిం వచ్చే నెలలో వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. ఐతే ఈ సినిమా కోసం విశాల్ ఒక మంచి ఛాన్స్ మిస్సయ్యాడట. ప్రస్తుతం తమిళంలో టాప్ స్టార్లలో ఒకడైన విజయ్‌కి అతను విలన్‌గా నటించాల్సిందట. కానీ డేట్ల సమస్య కారణంగా ఆ సినిమా చేయలేకపోయినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశాల్ వెల్లడించాడు.
‘లియో’లో సీనియర్ నటుడు అర్జున్ హరాల్డ్ దాస్ అనే నెగెటివ్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన టీజర్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. నిజానికి ఈ పాత్రను విశాల్ చేయాల్సిందట. అతణ్ని దృష్టిలో ఉంచుకునే దాన్ని డిజైన్ చేశాడట. కానీ ‘మార్క్ ఆంటోనీ’కి అప్పటికే డేట్లు కేటాయించడం వల్ల విశాల్ ఈ సినిమా చేయలేనని చెప్పాడట.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన పరిస్థితి అర్థం చేసుకుని అర్జున్‌ను ఆ పాత్రలోకి తీసుకున్నట్లు విశాల్ తెలిపాడు. విశాల్ లాంటి మాచో హీరో.. విజయ్ ముందు విలన్‌గా నిలబడితే.. వీళ్లిద్దరి మధ్య క్లాష్ వస్తే ఆ కిక్కే వేరుగా ఉండేది. విశాల్ ఇప్పటిదాకా విలన్ పాత్ర చేసింది లేదు. అందువల్ల అతడి కెరీర్లోనూ ఇదొక వైవిధ్యమైన పాత్రగా ఉండేది. ‘లియో’లో సంజయ్ దత్ ప్రధాన విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి హైపే ఉంది.
This post was last modified on September 2, 2023 7:26 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…