ప్రిమియర్లతోనే హాఫ్ మిలియన్.. వన్ మిలియన్ అంటూ స్టార్ హీరోల సినిమాల యుఎస్ కలెక్షన్ల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అభిమానులు. కానీ విడుదలకు నెల రోజుల సమయం ఉండగానే ప్రి సేల్స్‌తో హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేయడం మాత్రం అందరు హీరోలకూ సాధ్యం కాదు. బాక్సాఫీస్ ‘డైనోసర్’ ప్రభాస్‌కు ఈ ఘనత సొంతమైంది.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లు అయినప్పటికీ.. తన కొత్త చిత్రం ‘సలార్’కు హైప్ మామూలుగా లేదు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ మాస్ మూవీ కావడం, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన చిత్రం కావడంతో ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 28న రిలీజ్ అనుకుని 40 రోజుల ముందు టికెట్ల అమ్మకాలు మొదలుపెడితే పది రోజులు తిరిగేసరికే సినిమా హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది.
పక్కా ప్లానింగ్‌తో ‘సలార్’ యుఎస్ ప్రిమియర్స్ సేల్స్ మొదలుపెట్టగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంతో ఎగ్జైట్ అవుతూ టికెట్లు కొన్నారు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ సినిమాను వాయిదా వేసేసింది చిత్ర బృందం. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. సలార్ 28న రాదని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్లిపోయింది. యుఎస్‌లో సైతం టికెట్ల అమ్మకాలు ఆగిపోయాయి.
షోలన్నీ తొలగించారు. రీఫండ్స్ కూడా మొదలవుతున్నాయి. సర్వీస్ ఛార్జీలు మినహాయించుకుని మిగతా డబ్బులు వెనక్కి ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ అదృష్టం కొద్దీ ఇంకా ప్రమోషన్ల మీద ఏమీ ఖర్చు పెట్టకపోవడం వల్ల వాళ్లకొచ్చిన నష్టమేమీ లేదు. ప్రి సేల్స్ ఊపు చూస్తే ప్రిమియర్లతోనే ‘సలార్’ 2 మిలియన్ మార్కును టచ్ చేసేలా కనిపించింది. కానీ ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ‘సలార్’ కోసం ఆల్టర్నేట్ డేట్స్ చూస్తోంది టీం. సంక్రాంతి డేట్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 2, 2023 5:03 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…