మూడేళ్ళ క్రితం స్కామ్ 1992 వెబ్ సిరీస్ తో స్టాక్ మార్కెట్ మోసగాడిగా పేరు తెచ్చుకున్న హర్షద్ మెహతా జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు హన్సల్ మెహతా. అంతర్జాతీయ స్థాయిలో దానికి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తనే నిర్మాతగా మారి తుషార్ హీరానందని డైరెక్షన్ లో స్కామ్ 2003 తీసుకొచ్చారు. ఇరవై ఏళ్ళ క్రితం దేశాన్ని ఊపేసిన స్టాంప్ పేపర్ల కుంభకోణం సూత్రధారి తెల్జి జీవితంలోని పలు కీలక అంశాలును, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. మొన్నటి నుంచే ఇది స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇంతకీ సిరీస్ ఎలా ఉంది.
డిగ్రీ చదివినా ఉద్యోగం లేని అబ్దుల్ కరీం తెల్గి (గగన్ దేవ్ రియార్) ఉపాధి కోసం రైల్లో పండ్లు అమ్ముతూ ఉంటాడు. ఇతనిది కర్ణాటకలోని ఖానాపూర్ ఊరు. వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఇతని నైపుణ్యాన్ని చూసిన షౌకత్ ఖాన్ ముంబై రమ్మని కోరతాడు. కష్టాలు గట్టెక్కడం కోసం అక్కడికి వెళ్తాడు తెల్గి. నగరంలో ఏమి తెలియని ఇతను అతి తక్కువ కాలంలో వేల కోట్ల విలువ చేసే స్టాంపుల స్కామ్ ఎలా చేశాడు, వ్యవస్థకు దొరక్కుండా అన్నేళ్లు ఎలా తప్పించుకున్నాడనేదే అసలు స్టోరీ. 1982 నేపథ్యంతో మొదలుపెట్టి 2023 దాకా కథ నడిచేలా స్క్రిప్ట్ రాసుకున్నాడు తుషార్.
మొత్తం అయిదు ఎపిసోడ్లను చెరి 50 నిమిషాల పాటు అందించారు. ఒక సామాన్యుడు ఎక్కడో నాస్తిక్ లో ప్రింటయ్యే స్టాంప్ పేపర్ల రవాణాను పసిగట్టడం, నకిలీ వాటిని చెలామణిలోకి తీసుకురావడానికి అవినీతి ప్రభుత్వ వ్యవస్థను, రాజకీయ నాయకులను వాడుకున్న క్రమం చాలా నీట్ గా చూపించాడు తుషార్. నిడివిలో ల్యాగ్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగానే సాగింది. అయితే సీజన్ 1లో కేవలం ప్లాట్ ఎస్టాబ్లిషమెంట్ మాత్రమే చేశారు. 2000 సంవత్సరం తర్వాత తెల్గి చేసిన మోసాలు, ఎలా దొరికాడు, ఎందుకు ఆసుపత్రి పాలయ్యాడు, దుబాయ్ లో చేసిందేంటి లాంటి ప్రశ్నలకు సమాధానాలు సీజన్ 2 కోసం దాచి పెట్టారు. సో తెల్గి లైఫ్ ని పూర్తిగా చూపించలేదు. స్కామ్ 92 అంత గొప్పగా లేకపోయినా ఈ 2003 మంచి ప్రయత్నంగా నిలిచింది.
This post was last modified on September 2, 2023 7:28 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…