తమిళంలో విలక్షణ కథలతో ప్రయాణం చేసే స్టార్ డైరెక్టర్లలో వెంకట్ ప్రభు ఒకడు. ఇళయరాజా తమ్ముడు, సంగీత దర్శకుడు గంగై అమరన్ తనయుడైన వెంకట్.. దర్శకుడిగా తొలి చిత్రం ‘చెన్నై 28’తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిందా చిత్రం. ఆ తర్వాత సరోజ, గోవా, మన్‌కాతా, మాస్ లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు వెంకట్.
ఇలాంటి మంచి ట్రాక్ రికార్డున్న దర్శకుడు.. మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో జట్టు కట్టి తెలుగు, తమిళ భాషల్లో ‘కస్టడీ’ అనే సినిమా తీశాడు. వెంకట్ ప్రభు లాంటి దర్శకుడితో పని చేయడం చైతూ అదృష్టం అనుకున్నారు చాలామంది. కానీ ఆ సినిమా చైతూకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అసలే ఒడుదొడుకుల్లో ఉన్న చైతూ కెరీర్‌ను ఇంకా కిందికి లాగేసిందీ చిత్రం. తమిళంలో కూడా ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపలేదు.
‘కస్టడీ’ సినిమాలో వెంకట్ ప్రభు మార్కే కనిపించకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరిచింది. ఐతే ఇలాంటి డిజాస్టర్ ఇచ్చాక విజయ్ లాంటి సూపర్ స్టార్‌తో వెంకట్ జట్టు కట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగినపుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. నిజంగా వెంకట్‌ను నమ్మి విజయ్ ఈ అవకాశం ఇస్తాడా అనుకున్నారు. కానీ ఆ ప్రచారమే నిజమైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలోనే విజయ్ తన 68వ సినిమాను చేయబోతున్నాడు.
ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. భవిష్యత్తులోకి స్వాగతం అన్న క్యాప్షన్‌తో ఒక వెరైటీ పోస్టర్ ద్వారా సినిమాను అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే ఇది వెంకట్ ప్రభు మార్కు వెరైటీ సినిమా అనే విషయం అర్థమవుతోంది. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేసే చివరి సినిమా ఇదే అని.. అందుకే ఇందులో రాజకీయ అంశాలు కూడా ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారం ఎంత వరకు నిజమో కానీ.. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే మంచి హైప్ తెచ్చుకుందన్నది మాత్రం వాస్తవం.
This post was last modified on September 1, 2023 10:51 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…