Movie News

క్రింజ్ కామెడీ అన్నారు కోట్లు కురిపించారు

కంటెంట్ కరువుతో అల్లాడిపోతున్న బాలీవుడ్ జనాలకు ఓ మోస్తరు సినిమా ఇచ్చినా చాలు నెత్తినబెట్టేసుకుంటున్నారు. ముందు రొట్ట రొటీన్ అనిపించుకున్నవి కూడా బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేయడం విశేషం. గత వారం విడుదలైన ఆయుష్మాన్ ఖురానా కొత్త మూవీ డ్రీం గర్ల్ 2కి మొదటి రోజు ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. క్రిటిక్స్ గట్టిగానే తలంటారు. 2019లో వచ్చిన క్లాసిక్ హిట్ కి సీక్వెల్ గా దర్శకుడు రాజ్ శాండిల్య క్రింజ్ కామెడీతో విసిగించారని ప్రేక్షకులు సైతం అభిప్రాయపడ్డారు. అధిక శాతం అవుట్ డేటెడ్ కామెడీ ఉండటమే దీనికి కారణం.

ఇదంతా ఎలా ఉన్నా డ్రీం గర్ల్ 2కి మంచి రెవిన్యూ వస్తోంది. వంద కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయిగా వేషం మార్చుకున్న ఒక అబ్బాయి అగచాట్లనే ఇందులో కథాంశంగా తీసుకున్నారు. ఇలాంటివి మనకు కొత్త కాదు. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే రాజేంద్ర ప్రసాద్ మేడమ్, నరేష్ చిత్రం భళారే విచిత్రం లాంటివి చేశారు. క్లీన్ కామెడీతో అవి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. కానీ డ్రీం గర్ల్ 2లో అంత పరిశుభ్రమైన హాస్యమైతే లేదు. టేకింగ్ సంగతి పక్కనపెడితే ఆయుష్మాన్ ఖురానా మరోసారి క్యూట్ లేడీగా నటన పరంగా అదరగొట్టిన మాట వాస్తవం. స్క్రిప్ట్ సరిగా లేదంతే.

గదర్ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్, ఓ మై గాడ్ 2 సూపర్ హిట్ ఫలితం, ఇప్పుడీ డ్రీం గర్ల్ 2 వసూళ్లను చూసి నార్త్ ట్రేడ్ హమ్మయ్య అనుకొంటోంది. గత కొన్ని నెలల్లో యావరేజ్ అనిపించుకున్న సత్య ప్రేమ్ కి కథా, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, తూ ఝూటి మై మక్కర్, జర్ హట్కె జర బచ్కెలు బ్రేక్ ఈవెన్ దాటేసి నిర్మాతలకు భారీ లాభాలిచ్చాయి. జవాన్ తో మొత్తం సెట్ రైట్ అవుతుందనే ధీమా అక్కడి బయ్యర్లలో కనిపిస్తోంది. ఇదే ఊపు సలార్ వరకు కొనసాగిస్తే థియేటర్లు సగం జనంతో నిండి నిండని పరిస్థితి ఉండదని, నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టొచ్చని సంబరపడుతున్నారు 

This post was last modified on September 1, 2023 1:23 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago