Movie News

అర్జున్ రెడ్డి కాంబో వినడానికి బాగుంది కానీ

టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ మూవీస్ లో ఒకటిగా అర్జున్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. పబ్లిసిటీతో మొదలుపెట్టి కంటెంట్ వరకు ప్రతి విషయంలోనూ ట్రెండ్ సెట్టర్ అనిపించే రేంజ్ లో దీని గురించి జరిగిన డిస్కషన్లు, యంగ్ మేకర్స్ మీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. నిర్మాతలు ముందుకు రాకపోతే తన స్వంత డబ్బుని సోదరుడి సహాయంతో పెట్టుబడిగా పెట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అదిచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ ఏకంగా బాలీవుడ్ కు తీసుకెళ్లి రెండు మూడు వందల కోట్ల ప్రాజెక్టులు వచ్చేలా చేసింది. డిసెంబర్ లో వచ్చే అనిమల్ మీద అంచనాల గురించి చెప్పనక్కర్లేదు.

ఖుషి ప్రమోషన్లలో భాగంగా మైత్రి రవి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ-సందీప్ వంగాల కాంబోని రిపీట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇది చూసిన రౌడీ హీరో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు ఉంటుందా అని లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది అప్పుడప్పుడే జరగదు. యానిమల్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా సందీప్ కనీసం బయటికి రాడు. దాని తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టాలి. ఫైనల్ వెర్షన్ లాక్ చేసి డార్లింగ్ కి వినిపించాలి.

దీనికి ఎంత లేదన్నా ఆరేడు నెలలు పడుతుంది. ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టి అంత ప్యాన్ ఇండియా మూవీని ఫినిష్ చేయాలంటే తక్కువలో తక్కువ రెండేళ్లు పట్టే అవకాశాలు ఎక్కువ. అదే జరిగితే 2025 దాటిపోతుంది. మైత్రి నిర్మాతలు విజయ్, సందీప్ లతో కమిట్ మెంట్ తీసుకున్నా సరే కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుంది. పైగా అర్జున్ రెడ్డి కలయిక అంటే దాన్ని తలదన్నే సబ్జెక్టు రెడీ చేయాలి. సందీప్ వంగా టార్గెట్ ఫిల్మోగ్రఫీలో మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ ఉన్నారు. మరి మొదటి ప్రయారిటీ తన డెబ్యూ హీరోకే ఇస్తాడా లేక లేట్ చేస్తాడానేది బాగా వెయిట్ చేసి చూడాలి.

This post was last modified on September 1, 2023 12:42 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago