కేవలం రెండు వారాల వ్యవధిలో వచ్చిన మెగా బ్రదర్స్ సినిమాలు బ్రో, భోళా శంకర్ ఫైనల్ రన్ పూర్తి చేసుకున్నాయి. బ్రో ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చేయగా ఎంతో కొంత వస్తుందన్న ఆశ ప్లస్ ముందస్తుగా చేసుకున్న అగ్రిమెంట్లలో భాగంగా చిరు మూవీని ప్రధాన కేంద్రాల్లో కొనసాగించారు. థియేటర్ల నుంచి వెళ్లిపోయే నాటికి బ్రో నికరంగా మిగిల్చిన నష్టం 30 కోట్లకు పైగా ఉండగా భోళా శంకర్ ఏకంగా 50 కోట్లను కర్పూరం చేసేసింది. జైలర్ దెబ్బకు రెండు చాలా త్వరగా వాష్ అవుట్ స్టేజికి వచ్చేశాయి. ఉన్నంతలో పవన్ కళ్యాణే నయమనిపించగా మెహర్ రమేష్ దెబ్బ గట్టిగా పడింది.
రెండు కలిపి ఎనభై కోట్ల దాకా థియేటర్ బిజినెస్ లో పోగొట్టాయి. కాకతాళీయంగా బ్రో, భోళా శంకర్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం గమనార్హం. వీళ్లకు వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునను కలిపితే ఈ ఫిగర్ ఇంకా షాకిచ్చేలా ఉంటుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీకి జులై చివరి వారం నుంచి ఆగస్ట్ మూడో వారం దాకా అన్నీ పీడకలలే మిగిలాయి. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఇప్పటిదాకా అత్యంత తక్కువ గ్రాస్ వసూలు చేసిన మెగాస్టార్ రికార్డు మృగరాజు (42 లక్షలు) పేరు మీద ఉండగా భారీగా పెరిగిన టికెట్ రేట్లతోనూ భోళా శంకర్ 28 లక్షలను దాటలేకపోవడం ట్రాజెడీ.
వీలైనంత త్వరగా వీటిని మర్చిపోయేందుకు మెగా ఫ్యాన్స్ ట్రై చేస్తున్నారు. బ్రో ఓటిటిలో వచ్చాక బాగానే ట్రెండ్ అవుతోంది కానీ చూసినవాళ్లు మాత్రం ఇది థియేటర్ కంటెంట్ కాదనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. ఇక భోళా శంకర్ ని భారీగా చూస్తారన్న నమ్మకం కానీ గ్యారెంటీ కానీ డిజిటల్ వర్గాల్లో కనిపించడం లేదు. ఢిల్లీలో చికిత్స పూర్తి చేసుకుని వచ్చిన చిరు ముందు కూతురు సుష్మిత నిర్మించబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఇంకా దర్శకుడిని కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజిలను సమాంతరంగా పూర్తి చేయబోతున్నారు.
This post was last modified on September 1, 2023 8:25 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…