ఇంకో రెండు వారాల్లో స్కంద విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్, శ్రీలీల కాంబినేషన్ లో దర్శకుడు బోయపాటి శీను రూపొందించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ మీద ఫ్యాన్స్ కి భారీ అంచనాలున్నాయి. అయితే ట్రైలర్ వచ్చాక అందులో ఉన్న మాస్ కంటెంట్ కొంచెం ఓవర్ గా ఉండటంతో సోషల్ మీడియాలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మాట నిజమే. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు మిస్సయ్యాయనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. అందుకే ఫ్రెష్ గా ఇంకో హోమ్లీ ట్రైలర్ ని రెడీ చేసే పనిలో టీమ్ ఉన్నట్టు సమాచారం. ఓ వారం ముందు రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి.
ఇదంతా బాగానే ఉంది కానీ స్కంద బజ్ విషయంలో ఇంకా స్పీడ్ పెరగాలి. ఇప్పుడున్న హైప్ సరిపోదు. థియేట్రికల్ బిజినెస్ 60 కోట్ల దాకా చేశారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వినాయక చవితికున్న పోటీలో దాన్ని అందుకోవాలంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. నిర్మాతకు తెలుగు, తమిళ ఓటిటి ప్లస్ శాటిలైట్ అన్ని కలిపి 45 కోట్లిచ్చి హాట్ స్టార్ కొనుక్కున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. హిందీ శాటిలైట్ హక్కులు 35 కోట్లకు అమ్ముడుపోయాయట. ఆడియో రూపంలో ఇంకో అయిదు కోట్లు వచ్చినట్టు తెలిసింది. అంటే మొత్తం నాన్ థియేట్రికల్ నుంచే లెక్క 85 కోట్లకు చేరుకుంది. ఇదంతా బోయ మాస్ ప్రభావమే.
టేబుల్ ప్రాఫిట్స్ సంగతి పక్కనపెడితే స్కంద మీద బజ్ కు రామ్-శ్రీలీల-తమన్-బోయపాటి శీను నాలుగు పిల్లర్లుగా నిలుస్తున్నారు. ఆల్రెడీ పెట్టుబడి మొత్తం వచ్చేసింది కాబట్టి నిర్మాత నిశ్చింతగా ఉన్నారా లేక ఎలాగూ సూపర్ హిట్ బొమ్మ తీశాం కనక ఖచ్చితంగా జనాలకు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నారా సెప్టెంబర్ 15 వస్తే కానీ అర్థం కాదు. అఖండ బ్రాండ్ ఇమేజ్ బోయపాటి శీనుకి చాలా ప్లస్ అవుతోంది. తీసుకునేవి రొటీన్ కథలే అయినా మాస్ కి కిక్కిచ్చే స్థాయిలో వాటిని తీస్తాడని పేరున్న ఇతనికి ఏకంగా పవర్ హౌస్ తోడయ్యాడు. మరి డబ్బింగ్ సినిమాల పోటీని తట్టుకుని గెలవాల్సిందే.
This post was last modified on August 30, 2023 3:53 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…