మలయాళం ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైన మమ్ముట్టి ఘన వారసత్వాన్ని అందుకుని హీరోగా అరంగేట్రం చేశాడు దుల్కర్ సల్మాన్. ఐతే పెద్ద స్టార్ కొడుకు అంటే మాస్ హీరో అయ్యే ప్రయత్నం చేస్తాడు కానీ.. దుల్కర్ అందుకు భిన్నం. ఒక మాస్ ఎలివేషన్ల జోలికి వెళ్లకుండా మామూలు కుర్రాడి పాత్రలతో నటుడిగా తన ప్రతిభ ఏంటో చూపించడానికే ప్రయత్నించాడు. చూస్తుండగానే నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కేశాడు. మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.
పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక మాస్ ఇమేజ్ మీద దృష్టి పెడుతూ అతను చేసిన సినిమానే.. కింగ్ ఆఫ్ కోతా. ఈ సినిమాతో బాక్సాఫీస్‌లోనూ దుల్కర్ ‘కింగ్’గా అవతరిస్తాడని అభిమానులు అంచనా వేశారు. ఈ సినిమా రిలీజ్ ముంగిట బాక్సాఫీస్ రికార్డుల గురించి పెద్ద చర్చ జరిగింది. దుల్కర్ అన్ని రికార్డులనూ బద్దలుకొట్టేస్తాడని ఫ్యాన్స్ చెప్పుకున్నారు.
కట్ చేస్తే.. ‘కింగ్ ఆఫ్ కోతా’లో కంటెంట్ లేదని తొలి రోజు మార్నింగ్ షోలతోనే తేలిపోయింది. సినిమాకు బ్యాడ్ టాక్, రివ్యూలు వచ్చాయి. తొలి రోజు, వీకెండ్ వరకు కలెక్షన్లు పర్వాలేదు కానీ.. నెగెటివ్ టాక్ వల్ల సినిమా ఆ తర్వాత నిలబడలేకపోయింది. ఇలాంటి టాక్‌తో వీకెండ్ వరకు ఆ మాత్రం వసూళ్లు రావడమే ఎక్కువ అనే పరిస్థితి వచ్చింది. రికార్డులు బద్దలు కొట్టేస్తుందనుకున్న సినిమా కాస్తా.. ‘ఆర్‌డీఎక్స్’ అనే మిడ్ రేంజ్ మూవీ ముందు నిలవలేకపోయింది.
షేన్ నిగమ్ అప్‌కమింగ్ హీరో లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం కేరళలో సంచలనం రేపుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ మూవీకి అదిరిపోయే టాక్ వచ్చింది. ‘కింగ్ ఆఫ్ కోతా’ రిలీజైన మరుసటి రోజు వచ్చిన ఈ చిత్రం చూస్తుండగానే దాన్ని దాటేయడం దుల్కర్ అభిమానులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ‘కింగ్ ఆఫ్ కోతా’ ప్రస్తుతం రూ.33 కోట్ల రేంజిలో ఉంటే.. ‘ఆర్‌డీఎక్స్’ దాన్ని దాటి ముందుకు వెళ్లిపోయింది. వీక్ డేస్‌లోనూ హౌస్ ఫుల్స్‌తో నడుస్తున్న ‘ఆర్‌డీఎక్స్’ ఫుల్ రన్లో పెద్ద రేంజికి వెళ్లేలా ఉంది.
This post was last modified on August 30, 2023 3:29 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…