ఎమోషనల్ అండ్ సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తన కెరీర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ తో ఒక మల్టీస్టారర్ తీయడం గత ఏడాది నుంచే మూవీ లవర్స్ కి హాట్ టాపిక్ గా ఉంది. అయితే షూటింగ్ ప్రారంభం కావడంలో మాత్రం బాగా జాప్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం కీలకమైన కింగ్ మేకర్ లాంటి క్యారెక్టర్ కి నాగార్జున అంగీకారం కోసం వెయిట్ చేయడం వల్లేనట. తొలుత కథ విన్న నాగ్ కు అది బాగా నచ్చినప్పటికీ ఫుల్ వెర్షన్ ని పలుమార్లు విన్న తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీనికి మించిన మరో స్ట్రాంగ్ రీజన్ కూడా ఉందట.
నాగచైతన్యకు లవ్ స్టోరీ రూపంలో పెద్ద హిట్టు ఇచ్చిన శేఖర్ కమ్ముల మీద నాగార్జునకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా ఇప్పుడు ధనుష్ మూవీ తీస్తున్న ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ కుటుంబంతో ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో నో చెప్పడానికి ఛాన్స్ లేకపోయింది. పైగా తమిళంలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది కాబట్టి రక్షకుడు తర్వాత మళ్ళీ అరవ ప్రేక్షకులను మరోసారి పలకరించవచ్చనే ఆలోచన కలిగి ఉండొచ్చు. అయితే నాసామి రంగా చర్చల్లో చాలా సమయం ఖర్చు పెట్టాల్సి రావడంతో ధనుష్ సినిమాలో తానున్న విషయాన్ని లేట్ గా అనౌన్స్ చేయించారు.
ఏది ఏమైనా ఒక క్రేజీ కాంబోకి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పీరియాడిక్ డ్రాప్ లో ఉంటుందని తెలిసింది. నలభై ఏళ్ళ క్రితం దేశాన్ని ఊపేసిన ఒక సంఘటన ఆధారంగా పలు రాజకీయ నాయకులు,, మాఫియా డాన్ల చుట్టూ చాలా ఇంటెన్స్ డ్రామాని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ వచ్చినా పర్ఫెక్షన్ రావాలని ఈ స్క్రిప్ట్ మీద నెలల తరబడి వర్క్ చేసిన శేఖర్ కమ్ముల ఫైనల్ గా బెస్ట్ ఇస్తారని అంటున్నారు. నా సామిరంగా సంక్రాంతికి వస్తే నాగ్ ధనుష్ ల సినిమా దసరా రిలీజ్ కు ప్లాన్ చేస్తారట.
This post was last modified on August 29, 2023 4:23 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…