Movie News

నవ్యత కోసం పరితపించే ‘ప్రయోగార్జునుడు’

వారసుడిగా తండ్రిచ్చిన లెగసిని కొనసాగించడం తెరమీద చూసినంత సులభం కాదు. అందులోనూ కమర్షియల్ పంథాకు దూరంగా ప్రయోగాలు చేస్తున్నప్పుడు మార్కెట్ పరంగా ఎన్నో రిస్కులుంటాయి. కానీ లెక్క చేయకుండా ముందుకెళ్లి తనదైన బాణీని సృష్టించడం నాగార్జునకే చెల్లింది. 1986  బాలీవుడ్ హిట్ మూవీ హీరో రీమేక్ ‘విక్రమ్’తో తెరకు పరిచయమైనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయిగానే చూశారు ప్రేక్షకులు. మొదటి పరీక్షలో పాసైనా ఆ తర్వాత కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ రూపంలో పలకరించిన పరాజయాలు ‘మజ్ను’ దగ్గర ఆగిపోయాయి. దాని విజయం ఆత్మవిశ్వాసాన్ని నింపి జనంలో ఒక గుర్తింపు వచ్చేందుకు దోహదపడింది.

అటుపై కలెక్టర్ గారి అబ్బాయి, ఆఖరి పోరాటం, విక్కీ దాదా రూపంలో కమర్షియల్ బాట వదలకుండానే ‘గీతాంజలి’తో తనలో అసలు నటుడిని బయటికి తీయడం ఇతర అభిమానులు తలెత్తేలా చూసింది. 1989లో రామ్ గోపాల్ వర్మ అనే కుర్రాడు చెప్పిన కథ విని ‘శివ’ చేయడం టాలీవుడ్ గమనాన్ని మారుస్తుందని ఎలా ఊహించారో అది అక్షర సత్యమయ్యింది. అక్కడి నుంచి ప్రయోగాలకు పెద్ద పీట వేసిన నాగ్ కు ప్రేమ యుద్ధం, నేటి సిద్దార్థ, ఇద్దరూ ఇద్దరే, చైతన్య పెద్ద షాకులిచ్చాయి. సౌత్ నుంచి వచ్చిన మొదటి ప్యాన్ ఇండియా మూవీ ‘శాంతి క్రాంతి’ తెలుగు వెర్షన్ డిజాస్టర్ కావడం చేదు జ్ఞాపకం. జైత్రయాత్ర లాంటి సోషల్ మూవీ చేయడం ఆ టైంలో చాలా రిస్క్.

సరే ఎన్ని ఎక్స్ పరిమెంట్లు చేసినా అభిమానుల అంచనాలు అందుకోవడం కూడా ముఖ్యమని గుర్తించి మాస్ ని లక్ష్యంగా చేసుకున్న ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. అల్లరి అల్లుడు, వారసుడు, ఘరానా బుల్లోడు హలో బ్రదర్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. 1996లో ‘నిన్నే పెళ్లాడతా’ రూపంలో ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రికార్డులు సాధించగలదని నిరూపించడం ఒక చరిత్ర. భక్తి సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు వెనుకాడుతున్న టైంలో 1997 అద్భుత దృశ్య కావ్యం ‘అన్నమయ్య’ సంచలనం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. తర్వాత చిరంజీవి, బాలకృష్ణలు సైతం దీని స్ఫూర్తితో ఆధ్యాత్మిక బాట పట్టడం విస్మరించలేని విషయం

కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, సంతోషం, మన్మథుడు, నేనున్నాను చాలా దోహదపడ్డాయి. వరస వైఫల్యాలు కొన్నేళ్ల పాటు వెంటాడినా కొత్త దర్శకులు, జానర్లు ట్రై చేయడం నాగార్జున వదల్లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో అదిరిపోయే కంబ్యాక్ వచ్చినా సరే వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ లాంటి రిస్కులను మానుకోలేదు. ప్రతికూల ఫలితాలు వచ్చినా సరే. హిందీలో తన సమకాలీకులు ఎవరూ నటించిననన్ని ఎక్కువ సినిమాలు నాగ్ చేశారు. శివ, ఖుదా గావా, క్రిమినల్, మిస్టర్ బేచారా, ఎల్ఓసి, అంగారే, అగ్ని వర్ష, బ్రహ్మాస్త్ర ఇలా చాలానే ఉన్నాయి. తమిళంలో చేసిన రచ్చగన్ ఆ టైంలో చాలా ఖరీదైన ఇండియన్ మూవీ.

నిర్మాతగానూ తన అభిరుచిని అన్నపూర్ణ స్టూడియోస్, గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా చాటుకుంటూనే వచ్చారు. ఏఎన్ఆర్ ప్రధాన పాత్రలో కొత్త కుర్రాళ్లని పెట్టి వైవిఎస్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేసిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ ఒక సెన్సషనల్ హిట్. జగపతిబాబుతో ఆహా, సుమంత్ తో యువకుడు లాంటి ఎన్నో క్లీన్ ఎంటర్ టైనర్లు ఇచ్చారు. బిగ్ బాస్ రియాలిటీ షో వ్యాఖ్యాతగానూ నాగ్ వేసిన ముద్ర ఏడో సీజన్  దాకా తీసుకెళ్లింది. అంతకు ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా పెద్ద సక్సెసే. కేవలం నటుడిగానే కట్టుబడకుండా ఇలా ఎన్నో విభాగాల్లో ప్రజ్ఞ చూపించిన గ్రీకువీరుడంటే అందరికీ అందుకే అంతిష్టం.

This post was last modified on August 29, 2023 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

8 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

11 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

11 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

12 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

12 hours ago