ఏదైనా క్రేజ్ ఉన్న పెద్ద సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వీలైనంత త్వరగా మొదలుపెడితే ఎక్కువ థియేటర్లు నిండేందుకు ఆస్కారం ఉంటుంది. అప్పటిదాకా ఉన్న బజ్ ని ఆధారంగా చేసుకుని మొదటిరోజే చూద్దామని డిసైడయ్యే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటిది విజయ్ దేవరకొండ ఖుషికి సంబంధించి ఇప్పటిదాకా ఆన్ లైన్ బుకింగ్స్ షురూ కాలేదు. ఆగస్ట్ 30 ఉదయం పది గంటల నుంచి మొదలుపెడతామని అఫీషియల్ గా ప్రకటించారు. అంటే ఫస్ట్ షో షో పడే సమయానికి సరిగ్గా ఓ నలభై అయిదు గంటల ముందన్న మాట. ఇది చాలా లేట్ కిందే లెక్క.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంత నెమ్మదితనం సేఫ్ కాదు. అయితే ఖుషి నిర్మించిన మైత్రి మూవీ మేకర్సే దీన్ని స్వంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో నైజామ్ ప్రాంతంలో ఉన్న ఎగ్జిబిటర్ల నుంచి పంపకాలకు సంబంధించిన ఒప్పందాలు ఆలస్యం కావడం వల్లే థియేటర్ల లిస్టు ఇంకా పూర్తి స్థాయిలో ఫైనల్ కాలేదని ట్రేడ్ టాక్. ఎన్ని చర్చలు జరుగుతున్నా త్వరగా కొలిక్కి రాకపోవడంతో ఆన్ లైన్ అమ్మకాలు వేగంగా మొదలుపెట్టలేదని తెలిసింది. సెప్టెంబర్ 7న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, షారుఖ్ ఖాన్ జవాన్ లు వస్తున్న నేపథ్యంలో ఖుషికి ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకోవాలనే సందిగ్ధం ఉందట.
ఇవన్నీ సర్దుకుంటాయి కానీ ఖుషి మీదున్న పాజిటివ్ బజ్ భారీ ఓపెనింగ్స్ గా మారాలంటే టాక్ చాలా కీలకం కానుంది. జైలర్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఊపిచ్చే సక్సెస్ ఏదీ రాలేదు. బెదురులంక 2012 పర్వాలేదనిపించినా ఆ కాసింత దూకుడు ఆదివారం వరకే పరిమితమయ్యింది. అందుకే ఇప్పుడు మళ్ళీ థియేటర్లు కళకళలాడాలంటే ఖుషి బ్లాక్ బస్టరని పబ్లిక్ తో అనిపించాలి. విజయ్ దేవరకొండ – సమంతా – శివ నిర్వాణల కాంబినేషన్ తో పాటు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ బజ్ తీసుకొచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడమే కావాల్సింది. చూద్దాం.
This post was last modified on August 29, 2023 12:21 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…