సీనియర్ హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం , స్పీడ్ గా సినిమాలు చేయడం వంటివి ఎక్కువ ఫాలో అవుతుంటారు. అయితే ఈసారి బాలయ్య సినిమా , నాగార్జున సినిమా రెండూ పోటీ పడబోతున్నాయి. అయితే వీరు పోటీ పడుతుంది కొత్త సినిమాలతో కాదు. విషయం లోకి వెళ్తే , ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు చేసిన పాత సినిమాలను రీ రిలీజ్ రూపంలో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
ఈ నేపద్యంలో నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘మన్మధుడు’ సినిమాను అన్నపూర్ణ స్టూడియో సంస్థ ద్వారా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 29 న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. అయితే మరుసటి రోజు అంటే 30 న బాలయ్య నటించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’ ను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎక్కువ ప్రమోట్ చేయకుండా సైలెంట్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. కానే మన్మధుడు సినిమాను నెల ముందు నుండే ప్రమోట్ చేస్తూ రీ రిలీజ్ అన్న సంగతి జనాలకి రీచ్ చేశారు.
నిజానికి బాలయ్య నటించిన బైరవ ద్వీపం ను రాంగ్ టైమ్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏదైనా సందర్భం చూసి ప్రమోట్ చేసి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెస్తే బాగుండేది. ఇప్పుడు మన్మధుడు కి ఉన్న రీచ్ భైరవద్వీపం కి కనిపించడం లేదు. చూడాలి మరి రీ రిలీజ్ లతో బాలయ్య , నాగ్ ఎంత కలెక్ట్ చేస్తారో ? ఎవరు పై చేయి సాదిస్తారో ?
This post was last modified on August 28, 2023 5:21 pm
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…