మాములుగా ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కనక సరిగ్గా కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురుస్తుందని చాలాసార్లు ఋజువయ్యింది. దానికి భాషతో సంబంధం లేదు. ప్రేమ సాగరం, ప్రేమ దేశంతో మొదలుపెట్టి మధ్యలో హ్యాపీ డేస్, కొత్త బంగారులోకంతో కంటిన్యూ చేసి మొన్నటి బేబీ దాకా ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా నిర్మాతలను లాభాలతో హోరెత్తించాయి. అందుకే కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగురు చెన్నాగిద్దరేని తెలుగులోకి తీసుకొచ్చారు. బాయ్స్ హాస్టల్ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ కలిసి మంచి ప్రమోషన్లతో రిలీజ్ చేశాయి.
కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ, నవ్వులు పంచడంలో ఫెయిల్ కానప్పటికీ బాయ్స్ హాస్టల్ మన జనానికి పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేదని వసూళ్లను చూస్తే అర్థమవుతోంది. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాలు మినహా చాలా చోట్ల పెద్దగా స్పందన లేదు. ఎంటర్ టైన్మెంట్ బాగానే ఉందనే టాక్ వచ్చినా ఆ స్థాయిలో థియేటర్ ఆక్యుపెన్సీలు లేవు. బిజినెస్ తక్కువగా చేయడం వల్ల లాభ నష్టాల ప్రసక్తి అంతగా ఉండదు కానీ పోటీలేని టైంలో వచ్చిన ఛాన్స్ ని సరిగా ఉపయోగించుకోని మాట వాస్తవం. గాండీవధారి డిజాస్టర్ కాగా బెదురులంక 2012 జస్ట్ ఓకే టాక్ తో బాగానే కొనసాగుతోంది.
వందలాది కుర్రాళ్ళు ఉండే హాస్టల్ లో జరిగే ఒక అనూహ్య సంఘటన చుట్టూ కథ రాసుకున్న నితిన్ కృష్ణమూర్తి దాన్ని తెరకెక్కించిన పూర్తిగా ఫన్నీగా ఉండటం బాయ్స్ హాస్టల్ కి ప్రధానమైన ప్లస్ పాయింట్. అయితే కామెడీ కొన్ని చోట్ల లౌడ్ అయిపోవడం, సెకండ్ హాఫ్ లో కొంత భాగం ఓవర్ ది బోర్డు వెళ్లిపోవడం ప్రతికూలంగా మారాయి. సగం పాలు బాగా ఎంజాయ్ చేస్తే మరో సగం అంత కిక్ ఇవ్వదు. పాతికేళ్ల లోపు బ్యాచులకు ఓకే కానీ రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం బాయ్స్ హాస్టల్ ని అంతగా స్వంతం చేసుకోలేకపోతున్నారు. ఈ శుక్రవారం ఖుషి వచ్చేలోపు వీలైనంత రాబట్టేసుకుని గట్టెక్కేయాలి.
This post was last modified on August 28, 2023 3:50 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…