నందమూరి మూడో తరంలో ఇప్పటికే చాలామంది హీరోలయ్యారు. కానీ అందులో బాగా సక్సెస్ అయి పెద్ద స్టార్ అయింది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. తారక్ తర్వాత పెద్ద రేంజికి వెళ్లగలడని నందమూరి అభిమానులు నమ్ముతున్నది మోక్షజ్ఞ విషయంలోనే. అతను చిన్న పిల్లాడిగా ఉండగానే కాబోయే స్టార్ అని ఫిక్స్ అయిపోయారు. మోక్షజ్ఞ టీనేజీలో ఉన్నప్పటి నుంచే అతడి అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు.
మామూలుగా పెద్ద ఫ్యామిలీ వారసుల విషయంలో జరిగే ప్లానింగ్ ప్రకారం చూస్తే మోక్షజ్ఞ ఈపాటికే హీరో అయిపోయి కొన్ని సినిమాలు చేసేసి ఉండాలి. కానీ రకరకాల కారణాల వల్ల అతడి డెబ్యూ బాగా ఆలస్యం అయిపోయింది. ఇదిగో అదిగో అనుకుంటూనే ఏళ్లు గడిచిపోయాయి. పలుమార్లు ఈ విషయంలో నిరాశ చెంది ఒక దశలో ఆ టాపిక్ గురించే మాట్లాడ్డం ఆపేశారు నందమూరి అభిమానులు.
ఐతే ఈసారి మాత్రం ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవచ్చనే అనిపిస్తోంది. సర్జరీ చేయించుకున్నాడో లేక కష్టపడి తగ్గాడో కానీ.. మోక్షజ్ఞ బరువు తగ్గి కొంచెం ఫిట్‌గా తయారయ్యాడు. అంతే కాక అతను తన తండ్రి సినిమా షూటింగ్‌లకు తరచుగా వెళ్తున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమా సెట్స్ నుంచి అతడి ఫొటోలు బయటికి వచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడితో చర్చలు జరుపుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన కజిన్ పెళ్లిలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో చాలాసేపు మాట్లాడాడు.
మామూలుగా మోక్షజ్ఞ చాలా సిగ్గరిగా ఉండేవాడు. కెమెరాల్లో పడటానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. కానీ ఇప్పుడు అతడిలో ఆ భయం పోయినట్లుంది. మానసికంగా డెబ్యూకి రెడీ అయినట్లే కనిపిస్తోంది. అతను నటనలో కూడా శిక్షణ తీసుకుంటున్నాడని.. అన్ని రకాల ట్రైనింగ్స్ నడుస్తున్నాయని.. మరోవైపు బాలయ్య కథ, దర్శకుడి ఎంపికలో బిజీగా ఉన్నాడని.. వచ్చే ఏడాది మోక్షు కెమెరా ముందుకు రావడం గ్యారెంటీ అని అంటున్నారు.
This post was last modified on August 28, 2023 6:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…