ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా సక్సెస్ అందని ద్రాక్షగా నిలిచిపోయిన కుర్ర హీరో రాజ్ తరుణ్ ఈసారి తిరగబడరా సామీగా వస్తున్నాడు. అప్పుడెప్పుడో గోపీచంద్ కి యజ్ఞం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక కొన్ని ఫ్లాపులతో గ్యాప్ తీసుకున్న ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. సురక్ష ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ కనిపిస్తోంది. పెద్దగా హడావిడి లేకుండా దీని టీజర్ ని సైలెంట్ గా రిలీజ్ చేశారు. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయనప్పటికీ సెప్టెంబర్ లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిమిషంన్నర వీడియోలో కథకు సంబంధించిన క్లూస్ ఇచ్చారు.
ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోతే వాళ్ళను తల్లితండ్రుల దగ్గరికి చేర్చడంలో అంతు లేని సంతోషాన్ని పొందటం ఆ యువకుడి(రాజ్ తరుణ్) నిత్యకృత్యం. అతను విపరీత భయస్తుడు. ప్రాణాలంటే మహా ప్రీతీ. బాలయ్య బెనిఫిట్ షో టికెట్ల కోసం హత్య చేసినా పర్వాలేదనే డేరింగ్ అమ్మాయి (మల్వి మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. గంజాయి వనం లాంటి ముఠాని నడిపిస్తున్న ఓ లోకల్ డాన్(మకరంద్ దేశ్ పాండే) మన హీరోకి ఓ ప్రమాదరకమైన పని అప్పజెబుతాడు. అసలు వీళ్లిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, ఆయుధం చూస్తే వణికిపోయే కుర్రాడు కత్తులు పట్టుకుని ఊచకోత ఎందుకు చేశాడనేదే కథ.
లైన్ పరంగా ఆసక్తికరంగానే ఉంది. జై బాలయ్య నినాదంతో పాటు అఖండ రెఫరెన్సులు బాగా వాడేశారు. జెబి – భోలే శవాలి సంయుక్తంగా సంగీతం అందించగా జవహర్ రెడ్డి ఛాయాగ్రాణం సమకూర్చారు. కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది. చలాకిగా కనిపించే రాజ్ తరుణ్ ఇందులో పిరికివాడిగా చూపించడం వెరైటీగా ఉంది. సరదాగా టైం పాస్ చేయించినా చాలు థియేటర్లకు వస్తామంటున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే తిరగబడరా స్వామి ఉంటే వర్కౌట్ అవుతుంది. అంచనాలు నిలబెట్టుకునే రాజ్ తరుణ్ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత హిట్టు పడ్డట్టే. రిలీజ్ డేట్ ని త్వరలో ఫిక్స్ చేయబోతున్నారు.
This post was last modified on August 28, 2023 10:58 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…