Movie News

ప‌ట్టించుకోన‌పుడు అద‌ర‌గొట్టాడు.. కానీ ఇప్పుడేమో

ప్ర‌వీణ్ స‌త్తారు అనే పేరు కొన్నేళ్ల ముందు వ‌ర‌కు అంత పాపుల‌ర్ ఏమీ కాదు. ఎల్బీడ‌బ్ల్యూ అనే క్రౌడ్ ఫండింగ్ మూవీతో అత‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. అంద‌రూ కొత్త వాళ్ల‌ను పెట్టి తీసిన ఆ సినిమా కొంచెం లేటుగా ప్రేక్ష‌కుల దృష్టిలో పడింది. ఆన్ లైన్లో చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత రొటీన్ ల‌వ్ స్టోరీ, చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల‌తో వైవిధ్య‌మైన ప్ర‌యాణం సాగించాడు ప్ర‌వీణ్‌. సినిమా సినిమాకూ జాన‌ర్ మారుస్తూ.. ప్ర‌తి సినిమాతోనూ త‌న అభిరుచిని చాటుతూ సాగాడు.

రాజ‌శేఖ‌ర్‌తో ప్ర‌వీణ్ తీసిన గ‌రుడ‌వేగ సినిమా ద‌ర్శ‌కుడిగా అత‌డిని చాలా మెట్లు ఎక్కించింది. అంద‌రూ మ‌రిచిపోయిన రాజ‌శేఖ‌ర్‌ను పెట్టి అత‌ను ఉత్కంఠ‌భ‌రిత థ్రిల్ల‌ర్ తీసి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్ర‌వీణ్ స్థాయిని ఎంతో పెంచిన సినిమా ఇది. అప్ప‌టిదాకా ప్ర‌వీణ్ మీద పెద్ద‌గా అంచ‌నాలు లేవు. అంచ‌నాలు లేన‌పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి మెప్పించిన ప్ర‌వీణ్‌.. త‌న‌పై అంచ‌నాలు పెరిగాక మాత్రం తీవ్రంగా నిరాశ ప‌రుస్తున్నాడు.

గరుడ‌వేగ చూసి ఇంప్రెస్ అయి అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో అత‌డికి ఛాన్స్ ఇచ్చాడు. నిర్మాత‌లు పెద్ద బ‌డ్జెట్ పెట్టారు. కానీ ది ఘోస్ట్‌తో అత‌ను ఏమాత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. గ‌రుడ‌వేగ‌లో చూపించిన నైపుణ్యం ఈ సినిమాలో కనిపించ‌లేదు. ఆ త‌ర్వాత అయినా త‌ప్పులు దిద్దుకుని ఒక ప‌క‌డ్బందీ సినిమాను అందిస్తాడేమో అనుకుంటే.. తాజాగా గాండీవ‌ధారి అర్జున‌తో మ‌రింత‌గా డిజ‌ప్పాయింట్ చేశాడు. కాన్సెప్ట్ బాగున్న‌ప్ప‌టికీ.. ఎగ్జిక్యూష‌న్లో ఫెయిల్ అవ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అంతో ఇంతో ది ఘోస్ట్ మూవీనే న‌యం అన్న‌ట్లుగా ఈ సినిమా క‌నీస స్థాయిలో కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. అంచ‌నాలు లేన‌పుడు మంచి మంచి సినిమాలు తీసిన ప్ర‌వీణ్‌.. త‌న‌పై అంచ‌నాలు పెరిగాక ఇలా నిరాశ ప‌ర‌చ‌డ‌మేంటో?

This post was last modified on August 28, 2023 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నగారంటే ఇంత నిర్లక్ష్యమా?

థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…

52 minutes ago

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

3 hours ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

3 hours ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

4 hours ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

5 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

5 hours ago