దర్శకుడు శంకర్ శైలి ఇద్దరు స్టార్ హీరోలను, రెండు పెద్ద ప్రొడక్షన్ కంపెనీలను ఇబ్బంది పెడుతోంది. మూడేళ్ళ క్రితం ప్రకటించి రెండు సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉన్న గేమ్ ఛేంజర్ ఎప్పుడు పూర్తవుతుందో దిల్ రాజుకే అంతు చిక్కడం లేదు. అప్డేట్స్ ఇవ్వమంటే అది దర్శకుడి చేతిలో ఉందని స్మార్ట్ గా తప్పించుకుంటున్నారు. ఏప్రిల్ లో ఇండియన్ 2 వస్తుందనుకుంటే ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ ఇన్ డైరెక్ట్ గా విడుదల తేదీ అంత త్వరగా ఉండదని తేల్చి చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసింది. ఎవరిది నిజమో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయినా సంబరపడేందుకు లేదు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ కి శంకర్ ఎంత సమయం తీసుకుంటారో చెప్పలేం. పైగా ఇండియన్ 2ని రెండు భాగాలుగా తీయాలని ముందు అనుకుని, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి, కమల్ హాసన్ వద్దని చెప్పాక మళ్ళీ వెనక్కు వచ్చారట. దీని ప్రభావం వల్లే రామ్ చరణ్ నెలల తరబడి చిత్రీకరణ లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే ఆర్సి 16 కోసం ఇవాళ మూడు అంతస్థులతో పెద్ద ఆఫీస్ ఒకటి తీసుకుని సాంప్రదాయ పూజలతో పని మొదలుపెట్టేశారు.
శంకర్ అర్జెంట్ గా నిర్ణయించుకోవాల్సింది ఒకటుంది. ముందు ఏది క్లియర్ చేయలేనిది డిసైడ్ అయితే దేనికి ఎక్కువ టైం ఇవ్వొచ్చో క్లారిటీ వస్తుంది. అంతే తప్ప డేట్లు ఉన్నాయని కొంత గేమ్ చేంజర్ కొంత ఇండియన్ 2కి ఇచ్చుకుంటూ పోతే వ్యవహారం ఇలాగే ఉండిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5 వస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ ని కనీసం జూన్ లేదా జూలైలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే తమిళ మార్కెట్ కి మంచి సీజనైన దసరా లేదా దీపావళికి ఇండియన్ 2 ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సందేహాలన్నీ తీర్చాల్సింది శంకరే.
This post was last modified on August 28, 2023 1:00 pm
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…