కేరళలో ఎంతో ముఖ్యమైన పండుగగా భావించే ఓనంని టార్గెట్ చేసుకుని మరీ దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కోతని ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంతో సహా ఇతర భాషల్లో పూర్తిగా డిజాస్టర్ కాగా ఏదో హీరో ఇమేజ్ పుణ్యమాని మలయాళం ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. నవీన్ పోలి రామచంద్రన్ బాస్ అండ్ కంపనీ కూడా అదే రోజు రిలీజై ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా అసలు మార్నింగ్ షోకి జనమే పెద్దగా లేకుండా వచ్చిన చిన్న సినిమా RDX ఊహించని రీతిలో సంచలన వసూళ్లు నమోదు చేస్తూ రికార్డుల వేట మొదలుపెట్టింది.
ఇదో ముగ్గురు యువకుల కథ. రాబర్ట్(షేన్ నిగమ్), డోనీ(ఆంటోనీ వర్గీస్) అన్నదమ్ములు. వీళ్ళ ప్రాణ స్నేహితుడు గ్సేవియర్(నీరజ్ మాధవ్). ఘాడమైన స్నేహంతో కలిసే ఉంటారు. ఓ చర్చి ఉత్సవంలో తండ్రికి అవమానం జరిగినందుకు డోని కొందరిని తుక్కు తుక్కుగా కొడతాడు. ఆ ముఠా అక్కడితో వదిలిపెట్టకుండా అర్ధరాత్రి వాళ్ళ ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్టుగా కుటుంబ సభ్యులను గాయపరుస్తుంది. కోపంతో రగిలిపోయిన ఆర్డిఎక్స్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం చేసి తమ ప్రతీకారం తీర్చుకున్నారనే పాయింట్ మీద దర్శకుడు నహాస్ హిదాయత్ స్టోరీ నడిపించాడు.
నిజానికిది చాలా పాత లైన్. గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కంప్లీట్ యాక్షన్ ప్యాకేజ్ గా ఇంటెన్స్ డ్రామాతో దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే ఆర్డిఎక్స్ ని నిలబెట్టింది. ముఖ్యంగా కథనాన్ని పరిగెత్తించిన తీరు ముందు ఏం జరుగుతుందో తెలిసినా కూడా ఆసక్తి రేపెలా ఉంది. దానికి తోడు కుంగ్ ఫు రేంజ్ లో డిజైన్ చేసుకున్న క్యారెక్టర్లకు ఆర్టిస్టులు ప్రాణం పోశారు. అందుకే మల్లువుడ్ ఆడియన్స్ కి ఇది భలే నచ్చేసింది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ని పక్కన పెట్టేసి ఎంచక్కా ఈ చిన్న చిత్రాన్ని హౌస్ ఫుల్ చేసే పనిలో పడ్డారు. కంటెంటా మజాకాని ప్రేక్షకులు ఊరికే అనలేదు.
This post was last modified on August 27, 2023 5:21 pm
ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…
2012 లో ఉప్పెన మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి..శ్యామ్ సింగరాయ్,. బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్…
భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా..…
ఒకవైపు దేశాన్ని మరోవైపు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తున్న అంశం… ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ కుబేరుడు.. గౌతం అదానీ…
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…