తెలుగు సినిమా చరిత్రలోల్ మొదటిసారి జాతీయ నటుడిగా అవార్డు సాధించాక అల్లు అర్జున్ ఆనందం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా తనకు ఈ పురస్కారం దక్కడం పట్ల బయట ఏమనుకుంటున్నారు, ఎలా టార్గెట్ చేయాలనుకుంటున్నారు తదితర విషయాలన్నీ గమనిస్తున్నట్టుగా ఇంటర్వ్యూలలో చెబుతున్న మాటలను బట్టి అర్థమవుతోంది. తానేమీ అందరి కంటే గొప్పవాడిని కానని, గతంలో ఎందరికో అర్హత ఉన్నా కేవలం టైం, పోటీ లాంటి కారణాల వల్ల మిస్ అయ్యుండొచ్చని, అంతే తప్ప బెస్ట్ యాక్టరనేది తన తలకు ఎక్కడం లేదని సవినయంగా చెప్పుకున్నాడు.
మొన్న రామ్ చరణ్ పెట్టిన విషెస్ ట్వీట్ కు బదులుగా సింపుల్ గా థాంక్ యు అంటూ బన్నీ స్పందించడం మీద ట్విట్టర్ లో పెద్ద రచ్చే జరిగింది. ఇద్దరూ మొక్కుబడిగా మెసేజులు పెట్టారనే ప్రచారం స్టార్టయ్యింది. కేవలం గంటల వ్యవధిలో చరణ్, ఉపాసనలు పంపించిన ఒక స్పెషల్ బొకే, గ్రీటింగ్ కార్డు ఫోటోని ఇన్స్ టాలో పోస్ట్ చేసి ఇది తనకు చాలా స్పెషలని చెప్పడం వెనుక అర్థం వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడమే. అంతే కాదు చిరంజీవిని కలుసుకుని ఆనందాన్ని పంచుకోవడం, బ్రహ్మానందం ఇంటికి వెళ్లి గంటన్నర పైగా గడిపి రావడం ఇవన్నీ పరిణితి చూపించే పనులే.
తానంటే ఇష్టం లేని వాళ్ళు కూడా జాతీయ అవార్డు వచ్చినందుకు సంతోషపడుతున్నారని చెప్పిన బన్నీ ఫోకస్ మొత్తం పుష్ప 2 ఉండబోతోంది. ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగిపోవడంతో సుకుమార్, బన్నీ, దేవిశ్రీ ప్రసాద్ లు ముగ్గురికి కొత్త సవాళ్లు మొదలయ్యాయి. బాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ స్పందించకపోవడం అభిమానులు, మీడియా దృష్టిలో లేకుండా పోలేదు. పైగా యాంటీ బ్యాచులు కొన్ని జై భీమ్, సార్పట్ట పరంపరకు రాలేదంటూ శోకాలు పెట్టడం కావాలని పుష్ప బ్రాండ్ ని లక్ష్యంగా పెట్టుకోవడమే. వీటి వల్ల కించిత్ కూడా నష్టమేమీ లేదు కానీ
This post was last modified on August 27, 2023 5:15 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…