నాలుగు రోజులుగా టాలీవుడ్లో చర్చలన్నీ అల్లు అర్జున్ చుట్టూనే తిరుగుతున్నాయి. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడు బన్నీనే కావడం విశేషం. అల్లు అర్జున్ కంటే ముందు ఎంతోమంది గొప్ప నటులు.. అద్భుత నటన కనబరిచిన పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ.. బన్నీకి ప్రతిభకు తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో అతడిని జాతీయ పురస్కారం వరించింది.
ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే బన్నీ గురించి మిగతా వాళ్లంతా ఎలా స్పందించారన్నది పక్కన పెడితే అతడి బన్నీ నటుడు కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన తన ముద్దుల మావయ్య చిరంజీవి, బన్నీ ఎదుగుదలలో కీలకంగా ఉన్న దర్శకుడు సుకుమార్.. అవార్డు విషయంలో బన్నీతో ఏం మాట్లాడారన్నది ఆసక్తికరం. ఈ విషయాలను బన్నీనే స్వయంగా మీడియా మీట్‌లో వెల్లడించాడు.
‘‘అవార్డు వచ్చాక చిరంజీవి గారిని కలిశాను. ‘ఒక నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఎందుకు ఇవ్వాలో ఒక లిస్ట్ వేస్తే.. అందులోని అన్ని బాక్సుల్లోనూ నీకు టిక్స్ పడతాయి. నువ్వు చేసిన వర్క్‌కి నీకు పురస్కారం రాకపోతే అతి తప్పయ్యేది’ అని చిరంజీవి గారు అన్నారు. ‘పుష్ప’లో నా గెటప్ మొదలుకుని ఎక్స్‌ప్రెషన్స్, నేను మాట్లాడిన యాస, కష్టమైన లొకేషన్లలో షూట్ చేయడం.. ఇలా అన్ని విషయాలనూ గుర్తు చేసి మరీ మెచ్చుకున్నారు.
ఒక కమర్షియల్ సినిమాలో ఇంత నటనను తీసుకురావడం కష్టమన్నారు. ఆ మాటలు మరింత ఆనందాన్నిచ్చాయి. ఇక అవార్డ్ వచ్చిందని తెలియగానే.. సుకుమార్ గారికే ఆ క్రెడిట్ ఇవ్వాలనిపించింది. అందుకే ఆయనతో ‘నేను వైర్ అయితే.. నువ్వు కరెంట్ డార్లింగ్’ అన్నాను. దానికాయన ‘నువ్వు వైర్ కాదు డార్లింగ్.. ఫైర్’ అన్నారు. నాకు అవార్డు రావాలని నాకంటే ఆయనే ఎక్కువ కోరుకున్నారు. ‘పుష్ప’లో నా నటనకు ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు ఆశ్చర్యపోవాలని ఆయన ఎంతో తపించారు’’ అని బన్నీ తెలిపాడు.
This post was last modified on August 27, 2023 3:56 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…