Movie News

ఓవర్ టు విజయ్ దేవరకొండ

టాలీవుడ్ బాక్సాఫీస్‌‌లో గత నెల అంతా ‘బేబి’ రూల్ సాగింది. జులై 14న విడుదలైన ఆ చిత్రం కొన్ని వారాల పాటు వసూళ్ల మోత మోగించింది. ‘బ్రో’ లాంటి పెద్ద సినిమాను కూడా వెనక్కి నెట్టి ఆ చిత్రం మూడో వారంలో కూడా మంచి షేర్ సాధించడం విశేషం. ఈ నెలలో సూపర్ స్టార్ రజినీకాంత్‌దే హవా. ఇండిపెండెన్స్‌ డే వీకెండ్లో రిలీజైన ఆ చిత్రం.. పోటీలో ఉన్న సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఆ సినిమా కూడా మూడో వారంలోనూ సత్తా చాటుతోంది.

ఈ వీకెండ్లో ఏకంగా నాలుగు పేరున్న సినిమాలు పోటీకి సై అన్నాయి కానీ.. అందులో ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. ఉన్నంతలో ‘బెదురులంక 2012’ పరిస్థితి మెరుగ్గా ఉంది. దానికి వసూళ్లు పర్వాలేదు. కన్నడ అనువాద చిత్రం ‘బాయ్స్ హాస్టల్’ అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోతోంది. గాండీవధారి అర్జున, కింగ్ ఆఫ్ కోతా వాషౌట్ అయిపోయాయి.

‘జైలర్’తో పాటు ఈ వారం సినిమాలు కూడా వచ్చే వారం వరకు నిలిచే పరిస్థితి లేదు. తర్వాతి వారానికి షెడ్యూల్ అయిన ‘ఖుషి’ మీదికి అందరి దృష్టి మళ్లబోతోంది. ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అదిరిపోయే పాటలు సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాయి. ట్రైలర్ కూడా బాగానే సాగడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విజయ్ చివరి చిత్రం ‘లైగర్’, సమంత లాస్ట్ మూవీ ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్లు అయినప్పటికీ.. వాటి ఎఫెక్ట్ ‘ఖుషి’ మీద పడలేదు. ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాపై హైప్ కూడా బాగానే ఉండటంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అని స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర కూడా లైన్ క్లియరైంది కాబట్టి.. ఎటొచ్చీ కావాల్సింది పాజిటివ్ టాక్ మాత్రమే. ట్రైలర్ చూస్తే మినిమం గ్యారెంటీ మూవీలా ఉంది. మరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం విజయ్ కెరీర్లో ‘ఖుషి’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశాలున్నాయి.

This post was last modified on August 27, 2023 12:39 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

25 minutes ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

1 hour ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago