అభిమానులు మెగా ప్రిన్స్ గా పిలుచుకునే వరుణ్ తేజ్ టైం అస్సలు బాగున్నట్టు లేదు. కుర్రాడు ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం రావడం లేదు. పోనీ ఏదో యావరేజ్ లైనా వస్తే ఏదోలే అనుకోవచ్చు. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కు తేలేనంత దారుణంగా డిజాస్టర్లు పడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. గత ఏడాది గని కోసం వరుణ్ ఒళ్ళు బాగా హూనం చేసుకున్నాడు. బాక్సర్ గా కనిపించాలని చాలా కఠినమైన కసరత్తులు వర్కౌట్లు చేశాడు . తీరా చూస్తే బ్రేక్ ఈవెన్ మాట దేవుడెరుగు థియేటర్ బిజినెస్ లో కనీసం సగం కూడా వెనక్కు రాలేదు.
తాజాగా గాండీవధారి అర్జున సైతం ఇదే బాట పట్టింది. గనికి కనీసం డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ఇప్పుడీ స్పై థ్రిల్లర్ కు అవి కూడా రాలేదు. జనం ఈ గూఢచారి మూవీ పట్ల ఎంత మాత్రం ఆసక్తిగా లేరని మార్నింగ్ షో నుంచే బయట పడిపోయింది. చాలా చోట్ల సగం హాళ్లు కూడా నిండకపోవడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ వచ్చినా కొంచెం బెటర్ గా ఉండేది కానీ వాళ్లే దూరంగా ఉన్నారంటే దీనికి వచ్చిన బజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ టాక్, రివ్యూలు ఎంత మాత్రం ఆశాజనకంగా లేకపోవడం ఫలితం మీద మరింత ప్రభావం చూపిస్తోంది.
విభిన్న కథలను ఎంచుకోవడం మంచిదే కానీ వాటి బాక్సాఫీస్ స్టామినాని లెక్కలేసుకోవడం ప్రతి హీరోకు అవసరం. లైన్ వినగానే ఎగ్జైట్ అయిపోయి దర్శకుడిని గుడ్డిగా నమ్మడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ముందస్తుగా చూసుకోవాలి. పెదనాన్న చిరంజీవికే భోళా శంకర్ రూపంలో దారుణ పరాభవం తప్పలేదు. అలాంటిది వరుణ్ తేజ్ కు ఈ సిచువేషన్ అనూహ్యం ఏమీ కాదు. మళ్ళీ ఫిదా, తొలిప్రేమ తరహా సాఫ్ట్ స్టోరీస్ చేస్తేనే మెగా ప్రిన్స్ గాడిలో పడేటట్టు ఉన్నాడు. డిసెంబర్ లో రాబోయే ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఎయిర్ స్పేస్ యాక్షన్ థ్రిల్లర్. ఇదైనా కోరుకున్న బ్రేక్ ఇస్తే అదే పది వేలంటున్నారు ఫ్యాన్స్.
This post was last modified on August 26, 2023 9:03 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…