జాతీయ అవార్డు సాధించిన ఆనందంలో ఉన్న అల్లు అర్జున్ కు పుష్ప 2 ది రూల్ కి జరగబోయే బిజినెస్, హంగామాని తలుచుకుని అభిమానులు అప్పుడే మేఘాల్లో తేలిపోతున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సీక్వెల్ కి సంబంధించిన కీలక ఎపిసోడ్స్ రష్మిక మందన్నతో పాటు ఇతర తారాగణం పాల్గొనగా క్రమం తప్పకుండా తీస్తున్నారు. ఫహద్ ఫాసిల్ డేట్ల అందుబాటుని బట్టి దానికి అనుగుణంగా బన్నీతో ఉన్న కాంబినేషన్ సీన్లను టైం దొరికినప్పుడంతా పూర్తి చేస్తున్నారు సుకుమార్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పుష్ప 2 విడుదల తేదీని దాదాపుగా లాక్ చేశారట.
వచ్చే ఏడాది మార్చి 22 రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇది హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్ వచ్చిన తేదీ. దీని వెనుక పెద్ద వ్యూహం కనిపిస్తోంది. మొదటి వారం వీకెండ్ కాగానే 25న హోలీ వస్తుంది. 29న గుడ్ ఫ్రైడేతో కలిపి మరో పెద్ద వారాంతం కలిసి వస్తుంది. మూడో వారం కాగానే ఏప్రిల్ 9న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామనవమి ఇలా వరస సెలవులు గుక్కతిప్పుకోకుండా పలకరిస్తాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈజీగా నెల రోజులు స్ట్రాంగ్ రన్ ఉంటుంది కాబట్టి పుష్ప 2ని ఎట్టి పరిస్థితుల్లో ఆ టైంకి సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారట.
అఫీషియల్ గా ప్రకటించే దాకా ఖరారుగా చెప్పలేం కానీ మొత్తానికి ఒక కంక్లూజన్ కు వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా చేతిలో అయిదు నెలల సమయం ఉంది. దర్శకుడు సుకుమార్ కొంత నెమ్మదిగా వెళ్లడం నిజమే కానీ ఇప్పటికీ బాగా ఆలస్యమైపోవడంతో స్పీడ్ పెంచబోతున్నట్టు తెలిసింది. ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి పాటను అక్టోబర్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. ఆయనకూ జాతీయ అవార్డు ఈ సినిమా నుంచే వచ్చింది కాబట్టి సాంగ్స్ పరంగా అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. సో అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేద్దాం
This post was last modified on August 25, 2023 12:20 pm
కరోనా దెబ్బకు ఆల్రెడీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏవైనా పెద్ద, ఈవెంట్ సినిమాలు రిలీజైనపుడే థియేటర్లు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…