మెగా ఫ్యామిలీ నుంచి భారీ అంచనాలతో హీరో అయినప్పటికీ.. తన కటౌట్‌కు తగ్గట్లు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా ‘ముకుంద’ లాంటి క్లాస్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత కూడా అతను వైవిధ్యమైన సినిమాలతోనే ప్రయాణం సాగిస్తున్నాడు. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి చిత్రాలతో మంచి విజయాలందుకున్న వరుణ్‌కు ఆ తర్వాత సరైన సినిమాలు పడలేదు.
గత ఏడాది ‘గని’తో షాక్ తిన్న అతను ఇప్పుడు ‘గాండీవధారి అర్జున’ అవతారం ఎత్తాడు. ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన కెరీర్లో ఇది ఓ ప్రత్యేకమైన సినిమా అంటున్న వరుణ్.. ఈ చిత్రం తనలో వ్యక్తిగతంగా కూడా చాలా మార్పు తెచ్చిందని.. బాధ్యత పెంచిందని చెబుతున్నాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వారిలో ఆలోచన రేకెత్తించే సినిమా ఇదని అతనన్నాడు.
‘‘గాండీవధారి అర్జున సినిమాలో మేం ఒక మంచి సందేశం ఇస్తున్నాం. అలా అని మీరు మారండని మేం చెప్పడం లేదు. ఒక సమస్యను ఆలోచన రేకెత్తించేలా చూపించాం. అది చూశాక మనలో ఎలాంటి మార్పు అవసరం అనేది ఎవరికి వాళ్లే నిర్ణయించుకుంటారు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పటి నుంచి స్వతహాగా నాలో చాలా మార్పులొచ్చాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించా. సెట్లో కూడా ఏది పడితే అది వాడి పడేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
మంచి సినిమాలు చేయాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ధ్యాసలో చుట్టూ ఏం జరుగుతుందో కొన్నిసార్లు పట్టించుకునేవాడిని కాదు. కానీ గమనిస్తే ఇప్పటికే మనకు సరైన సమయంలో వర్షాలు పడటం లేదు. ఎండలు పెరిగిపోయాయి. ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వస్తువులు కొని వాడేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ ఎక్కడికి పోతుందో ఆలోచించడం లేదు. కమర్షియల్ అంశాలతో పాటే ఈ విషయాలన్నీ సినిమా చర్చిస్తుంది. ఇందులో నేను చేస్తున్నది ఏజెంట్ పాత్ర కాదు. నేనొక బాడీ గార్డ్. నాది అర్జునుడి తరహా పాత్ర అయితే.. నాజర్ నన్ను నడిపించే శ్రీకృష్ణుడి తరహా క్యారెక్టర్లో కనిపిస్తారు’’ అని వరుణ్ తెలిపాడు.
This post was last modified on August 24, 2023 12:02 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…