ఆదిపురుష్ మీద బోలెడన్ని విమర్శలు, వివాదాలు వచ్చినప్పటికీ ఇతర దర్శక నిర్మాతలకు రామాయణం గాథ మీద సినిమాలు తీయాలన్న మోజు పోవడం లేదు. అయోధ్య రామాలయం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చారిత్రక ఘట్టానికి ఒక వెండితెర జ్ఞాపకంగా ప్యాన్ ఇండియా మూవీని ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రొడ్యూసర్ మధు మంతెన ఈ రమణీయ కథని మూడు భాగాలుగా తెరకెక్కించాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా అలియా భట్, రావణుడిగా కెజిఎఫ్ యష్ లను పెట్టుకోవాలని ఆ మేరకు వాళ్ళతో చర్చల్లో ఉన్నారు.
తాజాగా వచ్చిన ట్విస్టు ఏంటంటే అలియా భట్ ఇప్పుడీ ప్రాజెక్టుకు నో చెప్పిందట. అదేంటి భర్తతో అందులోనూ అంత పవిత్రమైన ఇతిహాసంలో నటించే ఛాన్స్ వస్తే ఎందుకు వద్దంటోందనే సందేహం వచ్చిందా. దానికి పలు కారణాలు ఉన్నాయట. మొదటిది దీనికి సరిపడా డేట్లు ఇవ్వడానికి అలియా సుముఖంగా లేదు. దర్శకులు నితీష్ తివారి – రవి ఉద్యావర్ ఎంతగా కన్విన్స్ చేయాలని చూస్తున్నా ఆమె ఒప్పుకోవడం లేదని ముంబై రిపోర్ట్. అంతే కాదు యష్ కూడా ఇటు ఎస్ చెప్పక, అటు నో చెప్పక బాగా నానుస్తున్నాడని దీని వల్ల డిసెంబర్ లో మొదలుపెట్టడం సాధ్యం కాదట.
వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న ఈ రామాయణాన్ని ఎవరూ మరిపించలేనంత గొప్పగా తీయాలని కంకణం కట్టుకున్నారు. తీరా చూస్తే ఇన్నేసి అడ్డంకులు. ఆదిపురుష్ ఫలితం ఎలా ఉన్నా అవన్నీ ఓం రౌత్ చేసిన తప్పులు కాబట్టి. అలా రిపీట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుని, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కాకుండా రియల్ విజువల్ ఎఫెక్ట్స్ తో తీయాలని ప్లాన్ చేసుకున్నారట. సరే అలియా వద్దంటే ఇప్పుడా స్థానంలో వేరొకరిని తీసుకోవడం పెద్ద సవాలే. మృణాల్ ఠాకూర్, కియారా అద్వానీ లాంటి రెండు మూడు ఆప్షన్లు పెట్టుకున్నారు కానీ చివరికి ఎవరికి ఆ గొప్ప పాత్ర దక్కుతుందో చూడాలి.
This post was last modified on August 23, 2023 9:24 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…