ఈ వారం బాక్సాఫీస్ మంచి రసవత్తరంగా ఉంది. వందల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్లు కానప్పటికీ అన్నీ కంటెంట్ తో వస్తున్న మీడియం రేంజ్ హీరోలవి కావడంతో ట్రేడ్ సైతం థియేటర్లు కళకళలాడతాయని ఎదురు చూస్తోంది. దుల్కర్ సల్మాన్ ‘కింగ్ అఫ్ కొత్త’ తెలివిగా గురువారమే రానుండటంతో ఓపెనింగ్స్ పరంగా దానికి చాలా ప్లస్ కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ గొప్పగా లేకపోయినా ఏ మాత్రం బాగుందని మౌత్ టాక్ వచ్చినా చాలు సాయంత్రం నుంచే హౌస్ ఫుల్స్ చేసేంత ఆసక్తిలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారని గత కొన్ని నెలలుగా ఋజువవుతూనే ఉంది కాబట్టి నిర్మాతల నమ్మకంగా ఉన్నారు.
వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మీద డీసెంట్ బజ్ ఉంది. ఈ ఏడాది గూఢచారి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏజెంట్, స్పైలు దారుణంగా దెబ్బ తిన్నాయి. అందుకే దీని మీద విపరీతమైన హైప్ లేదు కానీ విజువల్స్, మేకింగ్ చూస్తుంటే ఆషామాషీగా తీసిన మూవీగా కనిపించడం లేదు. బ్రో, భోళా శంకర్ గాయాలను ఇది తీర్చాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కార్తికేయ ‘బెదురులంక 2012’ మీద కామెడీ లవర్స్ కన్నేశారు. ఎన్ని వాయిదాలు పడినా ఫైనల్ గా సరైన టైంలో నిర్మాతలు దీన్ని తీసుకొస్తున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో కొన్ని చోట్ల ముందు రోజు ప్రీమియర్లు వేస్తున్నారు.
ఇక కన్నడ సెన్సేషనల్ హిట్ ని ‘బాయ్స్ హాస్టల్’గా ఛాయ్ బిస్కెట్, అన్నపూర్ణ సంస్థలు సంయుక్తంగా తీసుకొస్తున్నాయి. శాండల్ వుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ యూత్ ఎంటర్ టైనర్ ఇక్కడా ఎక్కేస్తుందనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఆయుష్మాన్ ఖురానా ‘డ్రీం గర్ల్ 2’ మీద అర్బన్ ఆడియన్స్ కన్నేశారు. ప్రధానంగా పోటీలో ఉన్న థియేటర్ రిలీజులు ఇవే. అందరూ కుర్ర హీరోలే కావడం గమనార్హం. సరే ఇంట్లోనే వినోదం కావాలన్నా బ్రో, బేబీలు ఒకేసారి ఓటిటి ఫ్రైడే ప్రీమియర్లు జరుపుకోబోతున్నాయి. ఎలా చూసుకున్నా ఈసారి మంచి స్టఫ్ అయితే ఉంది.
This post was last modified on August 23, 2023 3:10 pm
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…