Movie News

157పై ఫుల్ క్లారిటీ.. 156పై సస్పెన్స్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ముందు ప్రకటించినట్లే చిరు 157వ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిన్న అర్ధరాత్రే హింట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం కాన్సెప్ట్ పోస్టర్ లాంచ్ చేశారు. దాని మీద దర్శకుడు వశిష్ఠ పేరు కూడా పడిపోయింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ మూవీ ఇది అని జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. పోస్టర్ డిజైన్ జానర్‌కు తగ్గట్లే చేశారు.

పంచభూతాల చుట్టూ తిరిగే కథ ఇదనే సంకేతాలను పోస్టర్లో ఇచ్చారు. మొత్తానికి ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠ తొలి సినిమా శైలిలోనే చిరుతో సినిమా చేయబోతున్నారని స్పష్టమైంది. ఈ యువ దర్శకుడిగా ఇది గోల్డెన్ ఛాన్స్ అనడంలో సందేహం లేదు. చిరు తన స్థాయికి తగ్గ సినిమాలు చేయట్లేదని.. ఔట్ డేటెడ్ డైరెక్టర్లతో జట్టు కడుతున్నాడని ఫీలవుతున్న చిరు అభిమానులకు కూడా ఈ కాంబినేషన్ ఉపశమనాన్ని ఇస్తోంది.

మొత్తానికి చిరు 157వ సినిమా విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కానీ అంతకంటే ముందు మెగాస్టార్ చేయాల్సిన సినిమా విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని చిరు తనయురాలు సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బేనర్ మీద నిర్మించబోతున్న విషయంలో ఇంతకముందే ఖరారైంది. చిరు సైతం ఒక ఈవెంట్లో ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ చిత్రం మలయాళ హిట్ ‘బ్రో డాడీ’కి రీమేక్ అని.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే ఇటీవల స్క్రిప్టులో మార్పులు.. డైరెక్టర్ ఛేంజ్ అంటూ రూమర్లు వినిపించాయి. చిత్ర వర్గాలు ఆ ప్రచారాన్ని అనధికారికంగా ఖండించాయి. ఐతే చిరు పుట్టిన రోజుకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. జస్ట్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ తరఫున చిరుకు విషెస్ చెప్పారు. అది కూడా ‘గాడ్ ఫాదర్’లోని చిరు లుక్‌తో. అంతే తప్ప కొత్త సినిమా గురించి కబురేమీ లేదందులో. పోస్టర్ మీద ‘మెగా 156’ అని లేదు. దర్శకుడి పేరూ లేదు. దీంతో ఈ ప్రాజెక్టు మీద మళ్లీ సందేహాలు ముసురుకుంటున్నాయి.

This post was last modified on August 22, 2023 3:17 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

2 minutes ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

1 hour ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

1 hour ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

2 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

5 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

6 hours ago