‘ఘోస్ట్’ సినిమా అపజయం తర్వాత నాగార్జున కొంత బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. తన 99 వ సినిమాను ముందుగా రైటర్ ప్రసన్న చేతిలో పెట్టాడు నాగ్. ఆ సినిమా పై ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ వర్క్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు అదే ప్లేస్ లో కొరియో గ్రాఫర్ కి అవకాశం ఇచ్చాడు నాగ్. పలు పాపులర్ సాంగ్స్ కి డాన్స్ కొరియోగ్రఫీ చేసిన విజయ్ బిన్నీ నాగార్జున నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాను నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా టీజర్ తో ఎనౌన్స్ చేయబోతున్నారు.
ప్రస్తుతం టీజర్ ఘాట్ జరుగుతుంది. నాగార్జున బర్త్ డే కి ముందే అంటే 28 నే #Nag99 ఎనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. టీజర్ తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు విజయ్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. నాగార్జున- కీరవాణి కాంబోలో మంచి ఆల్బమ్స్ వచ్చాయి. ‘ఓం నమో వేంకటేశాయ’ వీరి కలయికలో వచ్చిన చివరి సినిమా. ఏడేళ్ళ తర్వాత ఈ కాంబో వస్తున్న సినిమా ఇది.
తన 99వ సినిమాకు రైటర్ ను డైరెక్టర్ గా మారుస్తాడాని భావిస్తే నాగ్ యూ టర్న్ తీసుకొని లారెన్స్ లాగే ఇప్పుడు కొరియోగ్రాఫర్ విజయ్ ను డైరెక్టర్ గా మార్చబోతున్నాడు. మరి దర్శకత్వంలో ఎలాంటి అనుభవం లేని విజయ్ బిన్నీ సీనియర్ హీరో సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో ? చూడాలి.
This post was last modified on August 22, 2023 12:08 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…