ఏ సినిమాకాయినా హీరో , హీరోయిన్ ఇద్దరూ ప్రమోషన్స్ లో పాల్గొంటే వచ్చే ఎటన్షన్ వేరు. అందులో స్టార్ హీరోయిన్ అయితే హీరో కంటే ఆమె వైపే మీడియా , ఆడియన్స్ ఫోకస్ ఉంటుంది. అయితే సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు సంబంధించి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి మీదే ఎక్కువ భారం పడుతుంది. ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. సినిమా రెడీ అయిపోయి రెండు నెలలు కావొచ్చింది. ఇప్పటికే కొన్ని డేట్స్ అనుకొని ఫైనల్ గా వచ్చే నెల డేట్ లాక్ చేసుకున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ముందు నుండి నవీన్ ఒక్కడే కనిపిస్తున్నాడు. అనుష్క ప్రమోషన్స్ కి రాలేనని ముందే టీం చెప్పినట్టు తెలుస్తుంది. ఒక ఈవెంట్ కి అలాగే ఓ ఇంటర్వ్యూ కి మాత్రమే తను హాజరవుతనని కండీషన్ పెట్టిందట. దీంతో ట్రైలర్ ఈవెంట్ లో కూడా అనుష్క హాజరు కాదని తెలుస్తుంది. అనుష్క తన కండీషన్ పక్కన పెట్టి కనీసం ఈట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వస్తే సినిమా ప్రమోషన్స్ లో ఇంకాస్త వేగం పెరిగేది.
ఇటీవలే నవీన్ పాల్గొన్న ఇంటర్వ్యూ కి అనుష్క చేసిన ప్రాంక్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనుష్క ఒక ఫోన్ చేస్తే వైరల్ అయిందంటే ఆమె నేరుగా ప్రమోషన్స్ కి వస్తే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం. పైగా ఆమె ఆడియన్స్ కి కనిపించి చాలా రోజులవుతుంది. ఏదేమైనా అనుష్క ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇవ్వడంతో పూర్తి భారం నవీన్ పొలిశెట్టి పైనే పడింది. ఇక చేసేదేం లేక నవీన్ తన స్టైల్ లో సినిమాను ప్రమోట్ చేస్తూ అటు ఇటు ఒక్కడే తిరుగుతూ కష్టపడుతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క కనిపించే వరకూ నవీన్ కి ఈ కష్టం తప్పదు మరి.
This post was last modified on August 21, 2023 7:55 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…