ఓటిటిలు విస్తృతమయ్యాక స్టార్లు లేని బయోపిక్ కథలను థియేటర్లో చూసేందుకు జనం ఇష్టపడటం లేదు. అందులోనూ బిగ్ బి వారసుడనే పేరు తప్ప అభినయం ఎంత ఉన్నా ఒక పరిధి దాటి ఎదగలేకపోతున్న అభిషేక్ బచ్చన్ కొత్త సినిమా గూమెర్ మొన్న థియేటర్లలో విడుదలయ్యింది. విమర్శకులు ఆహా అన్నారు. రేటింగ్స్ మూడు పైనే వచ్చాయి. ప్రివ్యూలు చూసిన ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు ట్విట్టర్ లో వదిలారు. ఇంతా చేసి మొదటిరోజు కోటిలోపే వసూలు చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా వీకెండ్ అయ్యేసరికి మూడున్నర కోట్లు అందుకోలేక చతికిలపడింది.
పా, చీనికమ్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించిన దర్శకుడు ఆర్ బాల్కి ఈ గూమెర్ ని రూపొందించారు. 1939లో ఒంటి చేత్తో ఒలంపిక్స్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన కరోలి టకాస్ జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. దాన్ని వర్తమానంలో ఒక లేడీ క్రికెటర్ కు ఆపాదించి కుడి చేయి కోల్పోయిన ఒక అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ గా ఎలా విజయం సాధించిందనే పాయింట్ తో తీశారు. జీవితంలో ఇంకేం లేదనుకుంటున్న టైంలో తాగుబోతుగా మారిన ఒక కోచ్ సహాయంతో ఓ యువతి అనుకున్నది ఎలా సాధించిందనే బ్యాక్ డ్రాప్ భారీ ఎమోషన్లు దట్టించారు.
ఇలాంటివి గత కొన్నేళ్లలో చాలా చూసిన ప్రేక్షకులకు ఇందులో సయామీ ఖేర్ పెర్ఫార్మన్స్ తప్ప ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు. అభిషేక్ నటన, షబానా ఆజ్మీ లాంటి సీనియర్ క్యాస్టింగ్ ఇవన్నీ ఫ్లాట్ నెరేషన్ ని కాపాడలేకపోయాయి. ఊహించినట్టే కథనం సాగుతూ పోవడం గూమెర్ లోని ప్రధాన మైనస్. కొన్ని మంచి సన్నివేశాలు, ఆలోచింపజేసే డైలాగులు ఎన్ని ఉన్నా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేయలేకపోయాయి. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే బెటర్ గా ఉండేదేమో కానీ గదర్ 2, ఓ మై గాడ్ 2 ప్రభంజనంలో కనీస స్థాయిలో నిలబడలేక మునిగిపోయింది
This post was last modified on August 21, 2023 6:16 pm
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…