మెగా ఫ్యామిలీ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది గని సినిమా. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాలేదు. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయింది. కిరణ్ కొరపాటి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తనయుడు బాబీ.. వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేయడం గమనార్హం.
ఏ సినిమా అయినా ఇలాంటి చేదు అనుభవం మిగిలిస్తే.. అసలెందుకు అది తేడా కొట్టిందని విశ్లేషించుకోవడం సహజం. వరుణ్ తేజ్ కూడా తన ఫెయిల్యూర్ల విషయంలోనూ అలాగే అనలైజ్ చేసుకుంటాడట. గని సినిమా విషయంలోనూ తప్పెక్కడ జరిగిందో అర్థమైందని వరుణ్ తన కొత్త చిత్రం గాండీవధారి అర్జున ప్రమోషన్లలో బాగంగా మీడియాకు వివరించాడు.
”గని నా తొలి ఫ్లాప్ కాదు. ఇంతకుముందు కూడా కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. సక్సెస్ కంటే ఫెయిల్యూరే మనకు ఎక్కువ నేర్పిస్తుంది. మిస్టర్ ఫ్లాప్ అయ్యాక తప్పెక్కడ జరిగిందో విశ్లేషించుకున్నా. దాన్ని ఫిక్స్ చేశా. ఆ తర్వాత నా నుంచి ఫిదా, తొలి ప్రేమ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. గని విషయానికి వస్తే.. తప్పు ఎక్కడ జరిగిందో మాకు తెలుసు.
అదొక స్పోర్ట్స్ డ్రామా. కానీ అందులో అన్నీ పెట్టాలని.. అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువ అయ్యేలా చూడాలని ప్రయత్నం చేశాం. అక్కడే తేడా కొట్టేసింది. నిజానికి సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నపుడే ఆ సినిమా ఆడదని అనిపించింది. కానీ ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని చిన్న ఆశ ఉండింది. కానీ అలా ఏమీ జరగలేదు. ఆ ఫలితం తర్వాత మరింత జాగ్రత్తగా ఉంటున్నా” అని వరుణ్ తేజ్ తెలిపాడు. గాండీవధారి అర్జున ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 21, 2023 12:47 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…