Movie News

గుంటూరు కారం – మహేష్ బాబు హామీ

ఘట్టమనేని అభిమానుల్లో విపరీతమైన అనుమానాలు, ఉత్సాహాలు రేపుతున్న గుంటూరు కారం 2024 సంక్రాంతికి విడుదలవుతుందా లేదానే డౌట్లకు స్వయంగా మహేష్ బాబే చెక్ పెట్టేశాడు. బిగ్ సి రెండు దశాబ్దాల వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఖచ్చితంగా పండగకు వస్తామని క్లారిటీ ఇచ్చేశాడు. నిర్మాత నాగవంశీ ఆ వీడియో బిట్  ని షేర్ చేస్తూ జనవరి 12 రిలీజ్ డేట్ ని నొక్కి వక్కాణిస్తూ రీ ట్వీట్ చేయడంతో ఇక ఈ విషయంలో అన్ని చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే. చాలా గ్యాప్ తర్వాత మహేష్ ఎక్కువ సేపు కెమెరా ముందు గడిపిన సమావేశం ఇదే.

ఇంకో నాలుగు నెలల పది రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో వేగం పెంచబోతున్నారు. రమ్యకృష్ణ డేట్లతో ఏదో సమస్య వచ్చిందనే వార్త ప్రచారమయ్యింది కానీ అందులో వాస్తవం లేదు. హైదరాబాద్ లోనే ప్లాన్ చేసుకున్న కీలక భాగంలో ఆవిడతో పాటు మహేష్ కూడా పాల్గొంటున్నాడు. తమన్ స్వరపరిచిన పాటల్లో రెండు ఆల్రెడీ ఓకే అయ్యాయట. ఫైనల్ రికార్డింగ్ అవ్వగానే మొదటి లిరికల్ వీడియో ఎప్పుడు వదలాలో నిర్ణయించుకుంటారు. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఉండొచ్చు.

ఈ శుభవార్త వినగానే మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా గాసిప్పులు, మార్పులు, బ్రేకులు, హీరో విదేశీ ప్రయాణాలు, పవన్ కి త్రివిక్రమ్ ఇచ్చిన కమిట్ మెంట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల గుంటూరు కారం కొంత ఆలస్యమైనా మాట వాస్తవమే. అయినా కూడా ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే సంకల్పంతో టీమ్ ఉంది. రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్ లు ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉన్నాయి. ప్రాజెక్ట్ కె వచ్చేది లేనిది ఇంకా ఖరారు కాలేదు. గుంటూరు కారం కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి రావాలనుకున్న ఒకరిద్దరు డ్రాప్ అవ్వొచ్చు. 

This post was last modified on August 20, 2023 11:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

1 hour ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

2 hours ago

బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!

అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…

2 hours ago

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

4 hours ago

తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఇదా?

ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…

4 hours ago

రవితేజ-శ్రీలీల.. మళ్లీ ఫైరే

మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…

4 hours ago