ఏకంగా కొత్త సినిమాలను దెబ్బ కొట్టే స్థాయిలో సాగుతున్న రీ రిలీజుల ప్రహసనం క్రమంగా పీక్స్ కు చేరుకుంటోంది. ఇండస్ట్రీ పెద్దలు సీరియస్ గా అలోచించి వీటిని కట్టడి చేసే విధంగా ఏదో ఒకటి చేయకపోతే రాను రాను పరిణామాలు ఊహించని విధంగా ఉండబోతున్నాయి. ప్రాక్టికల్ గా ఇది అంత సులభం కానప్పటికీ బయ్యర్లు, ఎగ్జిబిటర్లను ఒక తాటిపైకి తీసుకు రావడం వల్ల పూర్తిగా కాకపోయినా పరిమితంగా కట్టడి చేయవచ్చు. వీటికి వందలు వేలు ఖర్చు పెడుతున్న యువత ప్రతి శుక్రవారాలు లేటెస్ట్ మూవీస్ ఏం వస్తున్నాయో కూడా పట్టించుకోవడం లేదు.
ఇక్కడో కొత్త ట్విస్టు మొదలయ్యింది. డబ్బింగ్, స్ట్రెయిట్ అనే తేడా లేకుండా జనం ఎగబడి చూస్తున్న తీరు బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాతలకు కొత్త ఆశలు రేపుతోందట. ట్రేడ్ టాక్ ప్రకారం శంకర్ దాదా ఎంబిబిఎస్ కు రెండు కోట్ల దాకా, ఏ మాయ చేసావేకు కోటికి పైగానే సదరు హక్కుదారులు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇంద్రని వైజయంతి సంస్థ స్వంతంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ప్రస్తుతానికి దాని డీల్ పెండింగ్ లో ఉందని సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ లోపు 12 పైగా పాత సినిమాలు రీ రిలీజ్ చేసే విధంగా ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలిసింది.
కొన్ని క్లాసిక్స్ కి నిజంగానే ఆ స్థాయి క్రేజ్ కనిపిస్తోంది. ఉదాహరణకు 7జి బృందావన్ కాలనీకి ఇంకా నెల రోజులకు పైగా టైం ఉన్నప్పటికీ ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే చెప్పొచ్చు. మన్మథుడు, గుడుంబా శంకర్ లకు ప్రీ రిలీజ్ బజ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే బయటిక్ వాళ్లకు అమ్మడం కన్నా మనమే స్వంతంగా చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో బడా బ్యానర్లున్నాయి. ఈ నగరానికి ఏమైంది రిజల్ట్ చూశాక సురేష్ ప్రొడక్షన్స్ అందుకే వెంకటేష్ హిట్లని జాగ్రత్తగా ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు.
This post was last modified on August 20, 2023 2:17 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…