కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందని అక్కినేని అభిమానులు ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతున్న నాగార్జున కొత్త సినిమా ఈ నెల 29న హీరో పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా లాంచ్ కాబోతున్నట్టు సమాచారం. టైటిల్ గా ‘గలాటా’ను లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అధికారికంగా ఆ రోజే ప్రకటించే అవకాశాలున్నాయి. గతంలో రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టుకి ఇప్పుడు డైరెక్టర్ మారినట్టు లేటెస్ట్ అప్డేట్. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని ఆ స్థానంలో తీసుకుని బాధ్యతలు అప్పజెప్పినట్టు తెలిసింది.
ముందు నుంచి ప్రచారం జరిగినట్టు ఇది మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ రీమేక్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉందట. ఒకవేళ ఏదైనా ఫ్రెష్ సబ్జెక్టు అయితే లాంచింగ్ రోజు అనౌన్స్ చేశాక క్లారిటీ వస్తుంది. 2004లో నృత్య దర్శకుడు లారెన్స్ ని మాస్ తో మెగా ఫోన్ చేపట్టేలా చేసింది నాగార్జునే. అది పెద్ద హిట్ కావడంతో డాన్ కూడా ఇచ్చాడు. అది పూర్తి స్థాయి అంచనాలు అందుకోనప్పటికీ ప్రభాస్ రెబెల్ ఆఫర్ వచ్చేలా చేసింది. కట్ చేస్తే అతను హారర్ జానర్ వైపు వెళ్లి కోలీవుడ్ లో ఎన్ని అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడో చూశాం.
ఇప్పుడదే తరహాలో విజయ్ బిన్నీని ఇంట్రొడ్యూస్ చేసేలా నాగ్ ప్లాన్ చేసుకున్నారట. మొత్తానికి నెలల తరబడి జరిగిన నిరీక్షణకు చెక్ పడినట్టే. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకోవడం కూడా జరిగిందని అంటున్నారు. చిన్న వీడియో బిట్ ని గ్లిమ్ప్స్ రూపంలో షూట్ చేసి అదే రోజు రిలీజ్ చేస్తారని తెలిసింది. టెక్నికల్ టీమ్ తో పాటు ఇతర క్యాస్టింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు బర్త్ డే నాడు తెలియనున్నాయి. ఒకపక్క మన్మథుడు 4కె రీ రిలీజ్, మరోవైపు కొత్త లాంచ్ తో డల్లుగా ఉన్న అభిమానులు ఫుల్లు గలాటా చేసేలా డబుల్ జోష్ ఇవ్వబోతున్నారన్న మాట.
This post was last modified on August 20, 2023 11:37 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…